Share News

వికటించిన మధ్యాహ్న భోజనం

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:14 AM

మధ్యాహ్న భోజనం వికటించి నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో 39 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

వికటించిన మధ్యాహ్న భోజనం

  • నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత

  • వెంటనే చికిత్స.. ప్రమాదం లేదన్న వైద్యులు మంచి భోజనం పెట్టాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి

  • వెంటనే ఆస్పత్రుల్లో చికిత్స.. ప్రమాదం లేదన్న వైద్యులు

దన్వాడ/ ఎల్లారెడ్డి/ భానుపురి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం వికటించి నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో 39 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం మెనూ ప్రకారం భోజనంలో ఆలుగడ్డ, వంకా య కూరలు వడ్డించారు. భోజనం చేసిన తరువాత 25 మంది విద్యార్థులకు కడుపునొప్పి వచ్చింది. వారిలో కొందరు ఇళ్లకు వెళ్లగా తల్లిదండ్రులు వారిని తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు. అక్కడ ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌చార్జీ ప్రధానోపాధ్యాయుడు నరసింహాచారి వెంటనే స్పందించి ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు అక్కడే చికిత్స అందించారు. భయపడాల్సిందేమీ లేద ని విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్య సిబ్బంది చెప్పారు.


మరో ఘటనలో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 113 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా బుధవారం 90 మంది మధ్యా హ్న భోజనం చేశారు. వీరిలో 14 మంది విద్యార్థులు కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారు. గమనించిన ఉపాధ్యాయులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 10 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో వారిని ఇంటికి పంపించారు. మరో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరో ఘటనలో సూర్యాపేట గిరినగర్‌లోని ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భోజనం సరిగ్గా లేకపోవడం వల్లే తమ పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా నాణ్యమైన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో పెట్టాలని వారు అధికారులను కోరుతున్నారు.


వరుస ఘటనలు సిగ్గుచేటు: హరీశ్‌ రావు

మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఆసుపత్రిపాలు కావడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు.. నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వం లో చలనం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలు చేపట్టడంలేదని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 05:14 AM