CP CV Anand: హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు
ABN , Publish Date - Apr 10 , 2025 | 09:02 AM
ఈ నెల 12న జరిగే హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్దహించుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఆవాంచనీ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు.

- అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించొద్దు
- సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు
- సమీక్షా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: ఈ నెల 12న జరగనున్న వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచింరారు. ఫైర్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ, రవాణా శాఖ, ఆరోగ్య వైద్య శాఖలతో పాటు.. బజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, సీనియర్ అధికారులు, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, వీర హనుమాన్ విజయయాత్ర నిర్వాహకులతో కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించొద్దని హనుమాన్ విజయ యాత్ర నిర్వాహకులకు సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేయొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉదయం నుంచే భానుడి ప్రతాపం..
కొత్త వ్యక్తులను గుర్తించాలి
విజయయాత్ర, ర్యాలీలో కొత్త వ్యక్తులు చేరితే గుర్తించి పోలీసులకు తెలియజేయాలన్నారు. ఊరేగింపులో నిర్వాహకులు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. డీజే సిస్టమ్‌ను ఉపయోగించొద్దన్నారు. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు శనివారం వర్ష సూచన ఉన్నందున జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఊరేగింపులో ఎన్ని వాహనాలు వినియోగిస్తున్నారో సంబంధిత పోలీసులకు తెలియజేయాలన్నారు. నిర్వాహకులు రోప్ పార్టీ సభ్యులకు(వలంటీర్లకు) శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 8 నుంచి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో జాయింట్ కంట్రోల్ రూమ్ నుంచి బందోబస్తును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని, వివిధ శాఖల అధికారులు ఏ సమస్య వచ్చినా వెంటనే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
యాత్ర మార్గాన్ని పరిశీలించిన సీపీ
సమావేశం అనంతరం వివిధ శాఖల అధికారులు, నిర్వాహకులతో కలిసి సీపీ సీవీ ఆనంద్ విజయయాత్ర జరిగే శ్రీరామమందిరం గౌలిగూడ నుండి తాడ్‌బంద్ హనుమాన్ టెంపుల వరకు సుమారు 12.2 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు. అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాపిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, రఘుప్రసాద్, అడిషినల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలి
ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించే కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్తపేట, చంపాపేట్, సింగరేణి కాలనీ, సరూర్‌నగర్ ట్యాంక్ బండ్, దిల్‌సుఖ్‌నగర్, సరస్వతీనగర్ ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. సున్నిత ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. డీసీపీలు ప్రవీణ్‌కుమార్, జి.నరసింహా రెడ్డి, శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News