Google AI Mode: గూగుల్ ఏఐ మోడ్ అంటే ఏంటి.. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసా
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:25 PM
గూగుల్ ఇప్పుడు భారతదేశంలో కూడా తన కొత్త AI మోడ్ (Google AI Mode) ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను మొదట USలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిని ఇండియాలో కూడా ప్రారంభించారు. దీని స్పెషల్ ఏంటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్ కొత్తగా అమెరికాలో ఒక ప్రయోగంగా AI మోడ్‌ను (Google AI Mode) ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని భారతదేశంలో కూడా ప్రారంభించారు. ఈ సౌకర్యం ప్రస్తుతం Labs ఫీచర్ కింద ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి వచ్చింది. Google కొత్త ఏఐ మోడ్ స్పెషల్ ఏంటంటే వినియోగదారులు సంక్లిష్టమైన, వివరణాత్మక ప్రశ్నలను అడగడి.. దానికి సమాధానం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు Googleని ఇలా అడగవచ్చు.. ‘నా పిల్లలు 4, 7 సంవత్సరాల వయస్సు గలవారు. ఖరీదైన బొమ్మలను తీసుకోకుండా, వారిని ఇంట్లో చురుకుగా ఉంచడానికి సృజనాత్మక మార్గాలను సూచించాలని ప్రశ్నించవచ్చు’. ఈ ప్రశ్నకు అవసరమైన సమాధానాన్ని గూగుల్ మీకు అందిస్తుంది.
వాయిస్ లేదా పిక్
లెన్స్, వాయిస్ సెర్చ్ ద్వారా భారతదేశంలో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతుందని గూగుల్ తెలిపింది. అందుకే మీరు AI మోడ్‌లో మీ వాయిస్ లేదా ఫోటోతో కూడా ప్రశ్నలను అడగవచ్చు. ఉదాహరణకు ‘ఇది ఏ మొక్క? దీన్ని ఎలా తిరిగి నాటాలి? ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే ప్రశ్నలను కూడా అడగవచ్చు. అలాంటి వాటికి AI మోడ్ వెంటనే సమాధానం ఇవ్వడమే కాకుండా, దీని తర్వాత దానికి సంబంధించిన తదుపరి ప్రశ్నలను కూడా అందిస్తుంది. అంతేకాదు.. దీనికి ముందు ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది.
AI మోడ్ ఎలా పని చేస్తుంది
ఈ ఫీచర్ Google జెమిని 2.5 వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. ఇది క్వెరీ ఫ్యాన్ అవుట్ టెక్నిక్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మీ ప్రశ్నను చిన్న అంశాలుగా విభజించి, ఒకేసారి అనేక శోధనలను నిర్వహిస్తుంది. ఆ క్రమంలో మీకు తాజాగా ఖచ్చితమైన, వివరణాత్మక సమాధానాలను అందిస్తుంది. AI మోడ్‌ని ఉపయోగించి, మీరు రియల్ టైం డేటా, నాలెడ్జ్ గ్రాఫ్ నుంచి సమాచారాన్ని పొందవచ్చు. మీరు మిలియన్ల కొద్దీ ఉత్పత్తుల గురించి షాపింగ్ సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు. దీనికి మల్టీమోడల్ మద్దతు ఉంది. అంటే మీరు మాట్లాడటం రాయడం లేదా ఫోటోను అప్‌లోడ్ చేయడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.
ఏఐ మోడ్‌ను ఎలా ఉపయోగించాలి..
ముందుగా మీరు బ్రౌజర్‌కి వెళ్లండి labs.google.com.
అక్కడ AI మోడ్ అనే దానిని గుర్తించి ఆన్ చేయండి.
ఇప్పుడు ట్రై AI మోడ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.
లేదా Googleలో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేయండి.
ఆ క్రమంలో మీకు సమాచారం లభిస్తుంది.
ఇవీ చదవండి:
భారత్, ఇంగ్లాడ్ టెస్ట్‌ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..
భారీ వర్షాలు.. ఇద్దరి మృతి, 20 మంది గల్లంతు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి