Share News

New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..

ABN , Publish Date - Mar 06 , 2025 | 07:20 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో కూడా పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మార్కెట్లోకి మరో ఏఐ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..
new artificial Intelligence

మార్కెట్లోకి కొత్తగా మరో ఏఐ వచ్చేసింది. చైనీస్ టెక్నాలజీ దిగ్గజం అలీబాబా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను ఆవిష్కరించారు. ఈ మోడల్ QwQ-32B. అంటే 32 బిలియన్ పారామితులతో తయారు చేసిన ఒక కొత్త రీజనింగ్ మోడల్. అయితే ఇది OpenAI, o1-mini వంటి ప్రముఖ AI మోడళ్లతో పోటీ పడుతుందని అలీబాబా పేర్కొనడం విశేషం. ఈ మోడల్ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో అధిక సామర్థ్యం చూపిస్తుందని ఆయన అన్నారు. దీంతోపాటు ఇది చాలా తక్కువ డేటాతో పనిచేస్తుందన్నారు.


అలీబాబా AI మోడల్ QwQ-32B క్వెన్ 2.5 మోడల్‌పై పనిచేస్తుంది. క్వెన్ 2.5 అంటే అగ్రస్థాయిలో మానవుల వంటి ఆలోచనలు, నమూనాలు, సమస్యల పరిష్కారాలను కనుగొనడం వంటి పనులను నిర్వహిస్తుంది. ఇందులో టెక్స్ట్, చిత్రం, ఆడియో, మొదలైన ఫీచర్లు ఉంటాయన్నారు. ఈ కొత్త మోడల్ AI రంగంలో పలు కొత్త విషయాలను తెలిపేందుకు సహయపడనుంది. గతంలో ఉన్న మోడళ్లతో పోల్చితే ఇది అత్యాధునిక సామర్థ్యాలను కలిగి ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


ఈ కాంపాక్ట్ AI మోడల్ DeepAI, OpenAI, ఇతర టెక్ దిగ్గజాల AI మోడళ్లను అధిగమించినట్లు బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ తెలిపింది. రీసెంట్‌గా DeepAI R1 అనే AI మోడల్‌ను విడుదల చేసింది. ఇది 671 బిలియన్ పారామితులతో పనిచేస్తుంది. కానీ అలీబాబా మోడల్ QwQ-32B, 32 బిలియన్ పారామితులతో మరింత వేగవంతమైన పనితీరును అందిస్తుందని వెల్లడించింది. అలీబాబా AI బృందం ఈ మోడల్ ఆధారంగా డీప్‌లెర్నింగ్, రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL), పెద్ద భాషా నమూనాలు సహా ఇతర విభాగాలను పరిశీలిస్తోంది. ఈ మోడల్ AI మేధస్సును పెంచడంలో దోహదపడుతుందని, అలాగే యూజర్లకు మెరుగైన పరిష్కారాలను అందించగలదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


రీసెంట్‌గా DeepAI మోడల్ గణనీయమైన స్కేలింగ్‌, డేటా సామర్థ్యాలను చూపించింది. అయితే, అలీబాబా తన QwQ-32B మోడల్‌ను రూపొందించడం ద్వారా, తక్కువ పారామితులతో కూడిన మోడల్‌ను రూపొందించి, ఇతర దిగ్గజ మోడళ్లతో పోల్చి గొప్ప పనితీరును అందించినట్లు వెల్లడించారు. ఈ కొత్త AI మోడల్ రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) సామర్థ్యాన్ని అధిగమించడంలో, కృత్రిమ సాధారణ మేధస్సు (AGI)ను ప్రారంభించడంలో సహాయపడుతుందని కంపెనీ నమ్ముతుంది. AI మోడళ్లకు అధిక సామర్థ్యం ఇచ్చే లక్ష్యంతో అలీబాబా QwQ-32B మోడల్‌ను అభివృద్ధి చేసిందని ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

Spam Calls: స్పామ్ కాల్స్ కట్టడి కోసం కీలక చర్యలు.. రోజుకు 13 మిలియన్ల కాల్స్ బ్లాక్

Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 06 , 2025 | 07:20 PM