Passwords Leaked: 1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:27 AM
ప్రపంచవ్యాప్తంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల 1600 కోట్ల యూజర్ల ఇమెయిల్ IDలు, పాస్‌వర్డ్‌లు భారీ డేటా లీక్ (Passwords Leaked) వెలుగులోకి వచ్చింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్ యూజర్లకు కీలక సూచనలు జారీ చేసింది.

సైబర్ ప్రపంచంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏకంగా 1600 కోట్ల (16 బిలియన్) యూజర్ల ఇమెయిల్ ఐడీలతో పాటు పాస్‌వర్డ్ల డేటా లీక్ (Passwords Leaked) అయ్యింది. ఈ లీక్ తర్వాత ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అయిన గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, టెలిగ్రామ్ వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్సుంది. సైబర్ నిపుణులు ఈ ఘటనను సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా పెద్ద ముప్పుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల అవకాశాలను పెంచడంతో పాటు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంటున్నాయి.
ఎదుర్కొంటున్న ప్రమాదం
ఈ లీక్ గురించి డేటా పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం లీక్ అయిన డేటా ఒక అన్‌సెక్యూర్ సర్వర్‌లో గుర్తించారు. అది తక్కువ ప్రయత్నంతో అందరినీ యాక్సెస్ చేసేలా ఉంది. సర్వర్‌లో నిబంధనలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు, VPN లాగిన్లు, బిజినెస్ ఇమెయిల్స్, పాపులర్ సోషల్ మీడియా అకౌంట్ల క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఈ ప్రదర్శన వల్ల అనేక మంది వ్యక్తిగత, కార్పొరేట్ సంస్థల డేటా ప్రమాదంలో పడిపోయింది.
కొత్త పాస్‌వర్డ్‌లు కూడా లీక్
ఈ లీక్‌లో పాత, కొత్త పాస్‌వర్డ్‌లు రెండూ ఉన్నట్టు సైబర్ నిపుణులు తెలిపారు. దీనివల్ల హ్యాకింగ్, ఫిషింగ్, ఇతర సైబర్ క్రైమ్‌లు మరింత విస్తరించాయి. 350 కోట్ల రికార్డులు 30 కంటే ఎక్కువ డేటాబేస్‌లలో లీక్ అయినట్టు వెల్లడించారు. ఇందులో చాలా భాగం 2025 నుంచి ఇప్పటివరకు సేకరించబడ్డాయి. అంటే ఇటీవల అప్ డేట్ చేసిన పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.
గూగుల్ నుంచి హెచ్చరిక
ఈ విషయం తెలిసిన గూగుల్ యూజర్లకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పాస్‌వర్డ్‌లు యూజర్లు వెంటనే మార్చుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఈమెయిల్, బ్యాంకింగ్ అకౌంట్ల కోసం దీనిని పాటించాలని తెలిపింది. పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుకోవడం కోసం గూగుల్ ఈ సూచనలిచ్చింది.
పాస్‌వర్డ్‌లను మార్చండి: ముఖ్యమైన సేవలతో (ఈ మెయిల్, బ్యాంకింగ్) ఉన్న అకౌంట్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి
బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి: అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలు, అక్షరాల చిహ్నాలను కలిగిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి
టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA)యాక్టివేట్:2FA ద్వారా అదనపు రక్షణ వ్యవస్థ ఏర్పాటు
గూగుల్ పాస్కీ యాక్టివేట్: ఫిషింగ్, పాస్‌వర్డ్ బేస్డ్ దాడులను నివారించడానికి గూగుల్ పాస్కీ అనే ఫీచర్‌ని ఉపయోగించండి
అవసరమైన లింక్‌లను క్లిక్ చేయవద్దు: తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి
ప్రత్యేక సమాచారం పంచుకోవద్దు: ఎప్పుడైనా మెసేజింగ్ లేదా ఇమెయిల్ ద్వారా వ్యక్తిగత వివరాలను పంచుకోకండి
ఇవీ చదవండి:
గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి