India Cybercrime: 378 కోట్ల సైబర్ దోపిడీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:53 AM
సైబర్ మోసాల్లో ఇది పరాకాష్ఠ!. ఇప్పటి వరకు వ్యక్తులను డిజిటల్ అరెస్టు చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం తెలిసిందే.

దేశంలోనే అతిపెద్ద ‘క్రిప్టో’ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ సర్వర్ హ్యాక్
సంస్థ ఉద్యోగి ల్యాప్‌టాప్ నుంచే 44 మిలియన్ డాలర్ల బదిలీ
సంస్థ అంతర్గత భద్రతను లక్ష్యంగా చేసుకుని పేట్రేగిన సైబర్ ముఠా
కస్టమర్ల సొమ్ము భద్రమేనని నెబ్లియో వెల్లడి.. కేసు నమోదు
ఉద్యోగి అరెస్టు.. దేశంలోనే అతిపెద్ద సైబర్ దోపిడీ: పోలీసులు
బెంగళూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాల్లో ఇది పరాకాష్ఠ!. ఇప్పటి వరకు వ్యక్తులను డిజిటల్ అరెస్టు చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం తెలిసిందే. అలాగే ఇతర రూపాల్లోనూ మోసాలకు పాల్పడి నగదును దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుని పేట్రేగి పోతున్నారు. అత్యంత పటిష్ఠమైన అంతర్గత భద్రత ఉన్న బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి.. ఏకంగా రూ.378 కోట్లను వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. నెబ్లియో టెక్నాలజీస్.. దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ. ఈ సంస్థ పటిష్ఠమైన అంతర్గత భద్రతా చర్యలను పాటిస్తోంది. అయినప్పటికీ.. సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ సర్వర్‌లోకి ప్రవేశించి.. భారీ మోసానికి పాల్పడ్డారు. దీనికిగాను సంస్థ పార్ట్‌టైమ్ ఉద్యోగి ల్యాప్‌టా్‌పను వినియోగించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా దీనిని పేర్కొన్నారు. కాగా, సైబర్ నేరగాళ్లు బదిలీ చేసిన సొమ్ము పూర్తిగా సంస్థ, సంస్థ భాగస్వాములదేనని, వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగలేదని నెబ్ల్లియో టెక్నాలజీస్ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ హర్‌దీ్‌పసింగ్ తెలిపారు. క్రిప్టో సహా బిట్ కాయిన్ ఎక్సేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీ్‌సకు దేశంలోనే మంచి పేరుంది. దీనినే ‘కాయిన్ డీసీఎక్స్’గా కూడా పిలుస్తారు. ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహా రెండంచల భద్రతా వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే.. ఈ నెల 19, శనివారం తెల్లవారుజామున 2.37 గంటలకు కంపెనీ వాలెట్ నుంచి ఒక యూనైటెడ్ స్టేట్స్ డాలర్ టెదర్(యూఎ్‌సడీటీ) గుర్తు తెలియని వ్యాలెట్‌కు బదిలీ అయింది. ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు సైబర్ నేరగాళ్లు సర్వర్‌లోకి ప్రవేశించి, ఏకంగా 44 మిలియన్ యూఎ్‌సడీటీ(రూ.378 కోట్లు) బదిలీ చేశారు. ఈ బదిలీ జరిగిన తర్వాత.. వెబ్-3 ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ఉలిక్కిపడిన సంస్థ అధికారులు.. అసలేం జరిగిందన్న విషయంపై దృష్టిపెట్టారు. ఈ సంస్థలో పార్ట్‌టైమర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రాహుల్ అగర్వాల్ ల్యాప్‌టాప్ నుంచి సైబర్ నేరగాళ్లు కంపెనీ సర్వర్‌ను హ్యాక్ చేశారని గుర్తించారు. సంస్థ వైస్‌ప్రెసిడెంట్ హర్‌దీ్‌పసింగ్ ఈ నెల 22న వైట్‌ఫీల్డ్ సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను అదే ల్యాప్‌టా్‌పను మరోచోట వినియోగించినట్లు రాహుల్ చెప్పారు. దీనికిగాను అక్కడ రూ.15 లక్షలు పొందినట్లు తెలిపారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఫైర్ వాల్స్.. నామమాత్రం!
సాధారణంగా సిస్టమ్‌లను హ్యాక్ చేసేందుకు ఫిషింగ్, రాన్‌సమ్‌వేర్, బ్రూట్-ఫోర్స్ వంటి వాటిని నేరగాళ్లు వినియోగిస్తారు. కానీ, ‘కాయిన్ డీసీఎక్స్’ విషయంలో మాత్రం ఈ సంస్థ ప్రత్యేకంగా వినియోగిస్తున్న ‘ఇంటర్నల్ ఆపరేషనల్ అకౌంట్’ను లక్ష్యంగా చేసుకున్నారు. సంస్థ వినియోగిస్తున్న అధునాతన సర్వర్, వాల్ట్ ఐసోలేషన్, ఏపీఐలను అత్యంత చాకచక్యంగా సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి నెబ్లియో సంస్థ సిస్టమ్ రక్షణ కోసం ‘ఫైర్‌వాల్’ను ఏర్పాటు చేసింది. కానీ.. ఈ ఫైర్ వాల్స్.. ప్రధాన యాప్ సేవలకు, డేటాబేస్ భద్రతకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. దీంతో లిక్విడిటీ బ్రిడ్జ్ లేదా ఏపీఐకి అనుసంధించిన ఆపరేషనల్ వ్యాలెట్‌కు ఫైర్ వాల్స్ భద్రత కల్పించవు. నెబ్లియోలో కూడా ‘ఆపరేషనల్ వ్యాలెట్’ను హ్యాక్ చేయడం ద్వారానే సైబర్ మోసం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News