Delete These Apps: ఈ యాప్స్ వెంటనే తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక
ABN , Publish Date - Jun 12 , 2025 | 08:27 PM
ఆండ్రాయిడ్ వినియోగదారులూ, అప్రమత్తంగా ఉండండి. గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ మోసాల యాప్స్ (Delete These Apps) వెలుగులోకి వచ్చాయి. నమ్మకంగా అనిపించే కొన్ని యాప్‌లు మీ డిజిటల్ వాలెట్‌లను ఖాళీ చేయబోతున్నాయి. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ వర్గాలు సూచించాయి.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లకు అలర్ట్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని మోసపూరిత యాప్‌లు క్రిప్టోకరెన్సీ వాడే వాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ యాప్‌లు మీ క్రిప్టో వాలెట్‌లను దొంగిలించే ప్రమాదం ఉంది. దాదాపు 20 ఇలాంటి మోసపూరిత యాప్‌లు ప్లే స్టోర్‌లో గుర్తించబడ్డాయి. ఈ యాప్‌లు మీరు నమ్మే అసలు యాప్‌ల లోగోలు, పేర్లను కాపీ చేసి మోసం చేస్తున్నాయని తేలింది. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, అవి నకిలీ వెబ్‌సైట్‌లకు (Delete These Apps) వెళ్లేలా చేస్తాయి.
మీమోనిక్ ఫ్రేజ్ అంటే ఏంటి
మీమోనిక్ ఫ్రేజ్ అనేది మీ క్రిప్టో వాలెట్‌కు ఒక రహస్య కోడ్ లాంటిది. ఇది ఎవరికైనా తెలిస్తే, వాళ్లు మీ క్రిప్టో డబ్బులను దొంగిలించవచ్చు. సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (CRIL) నివేదిక ప్రకారం, 20కి పైగా ప్రమాదకరమైన క్రిప్టో వాలెట్ యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఈ యాప్‌లు మీ వాలెట్ రికవరీ సమాచారాన్ని దొంగిలించి మీ అకౌంట్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి.
గుర్తించబడిన మోసపూరిత యాప్‌ల లిస్ట్ (Delete These Apps)
Pancake Swap
Suiet Wallet
Hyperliquid
Raydium
BullX Crypto
OpenOcean Exchange
Meteora Exchange
SushiSwap
Harvest Finance Blog
దీని కోసం ఏం చేయాలి
మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్ సూచించింది
అధికారిక యాప్‌లలో మాత్రమే వివరాలు నమోదు చేయాలి. మీమోనిక్ ఫ్రేజ్‌ను అసలు యాప్‌లలో మాత్రమే ఎంటర్ చేయండి.
విశ్వసనీయ అకౌంట్ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లను అధికారిక వెబ్‌సైట్ లేదా నమ్మకమైన మూలాల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.
టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA): మీ అకౌంట్‌కు అదనపు భద్రత కోసం 2FA ఆన్ చేయండి.
వాలెట్ యాక్టివిటీని తనిఖీ చేయండి: మీ క్రిప్టో వాలెట్‌లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే క్రమం తప్పకుండా చెక్ చేయండి.
యాప్‌లను ఎలా తొలగించాలి?
మీ ఫోన్‌లో సెట్టింగ్స్ లోకి వెళ్లండి
యాప్స్ లేదా అప్లికేషన్స్ ఎంచుకోండి
మీరు తొలగించాలనుకున్న యాప్‌ను సెలెక్ట్ చేసి అన్‌ఇన్‌స్టాల్ బటన్ నొక్కండి
ఒకవేళ యాప్ అన్‌ఇన్‌స్టాల్ కాకపోతే
సెట్టింగ్స్ > సెక్యూరిటీ > డివైస్ అడ్మిన్ యాప్ వైపు వెళ్లండి
ఆ యాప్‌కు ఉన్న అనుమతులను ఆఫ్ చేయండి, ఆపై అన్‌ఇన్‌స్టాల్ చేయండి
జాగ్రత్తలు
ఎప్పుడూ తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు
యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలు, రేటింగ్‌లు చదవాలి
మీ క్రిప్టో వాలెట్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు
మీ ఫోన్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉంచుకోండి
ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. మీ ఫోన్, వాలెట్‌ను రక్షించుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News