Share News

CRIL Warning: ఈ 10 యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి..లేదంటే డేటా, డబ్బు, రెండు పోతాయ్

ABN , Publish Date - Jun 08 , 2025 | 09:22 PM

డిజిటల్ ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లే స్టోర్ ద్వారా కూడా ఫేక్ యాప్స్ ఉన్నాయని సైబర్ భద్రతా సంస్థ (CRIL Warning) రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో పలు రకాల యాప్స్‎ను వెంటనే తొలగించాలని సూచించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

CRIL Warning: ఈ 10 యాప్‌లను వెంటనే డిలీట్ చేయండి..లేదంటే డేటా, డబ్బు, రెండు పోతాయ్
malicious apps

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ కూడా సైబర్ మోసాలు కొత్త కొత్త విధాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పెరిగిన తర్వాత మోసగాళ్లు మరింత ఎక్కువగా మోసాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబర్ భద్రతా సంస్థ CRIL Warning (Cyble Research and Intelligence Labs) నివేదిక ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజర్ యాప్‌లు (Malicious Apps)ఉన్నట్లు తెలిపింది. ఈ యాప్‌లు క్రిప్టో వాలెట్‌ల రూపంలో కనిపిస్తూ వినియోగదారుల విలువైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దోచేస్తున్నాయని వెల్లడించింది.


ప్రధానంగా ఈ యాప్స్..

ఈ నేపథ్యంలో మీరు Android ఫోన్ వాడుతున్నట్లయితే, తక్షణమే మీ మొబైల్‌ నుంచి ఈ ఆప్‌లను వెంటనే తొలగించాలని సూచించింది. లేకపోతే పెద్ద నష్టం తప్పదని హెచ్చరించింది. ప్రమాదకరమని గుర్తించబడిన యాప్‎లలో Suiet Wallet, BullX Crypto, SushiSwap, Raydium, Hyperliquid, OpenOcean Exchange, Pancake Swap, Meteora Exchange, Harvest Finance Blog వంటివి ఉన్నాయి.


మోసం ఎలా పనిచేస్తోంది

ఈ యాప్‌లు వాస్తవమైన క్రిప్టో వాలెట్‌లను అనుకరించేలా డిజైన్ చేయబడ్డాయి. SushiSwap, PancakeSwap, Raydium, Hyperliquid, Suiet Wallet వంటి పాపులర్ డీసెంట్రలైజ్డ్ వాలెట్‌ల పేరుతో వచ్చాయి. కానీ యూజర్ ఇంటర్‌ఫేస్ విషయంలో వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యూజర్‌ను వారి 12 వర్డ్ రికవరీ ఫ్రేస్ (wallet recovery phrase)ను ఎంటర్ చేయమంటాయి. ఇది ఓ వాలెట్‌ను తిరిగి యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే అత్యంత కీలకమైన సెక్యూరిటీ విధానం. ఆ తర్వాత మోసగాళ్లు మీ వాలెట్‌ను యాక్సెస్ చేసి అందులో ఉన్న క్రిప్టోకరెన్సీని దోచేస్తారు.


ప్రైవసీ పాలసీ

ఈ యాప్‌లను డెవలపర్లు గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి యాప్‌ల పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. విశ్వసనీయంగా కనిపించేందుకు ఫేక్ ప్రైవసీ పాలసీ లింకులు కలిపి, అందులో ఫిషింగ్ లింకులను చొప్పిస్తున్నారు. ఈ యాప్‌లు రియల్ యాప్‌ల లేఅవుట్‌ను అనుకరిస్తాయి. దీంతో డౌన్‌లోడ్‌ల సంఖ్య, రేటింగ్‌లు కూడా ఫేక్‌గానే ఉంటాయి. చాలా మంది వీటి గురించి తెలియక బలైపోతున్నారు. కాబట్టి ఇలాంటి పేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 09:22 PM