Women WC 2025: ఫైనల్ రద్దయితే!
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:20 PM
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం వల్ల ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women’s World Cup 2025) చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. టైటిల్ పోరుకు సౌతాఫ్రికా, టీమిండియా అర్హత సాధించాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సౌతాఫ్రికా నేరుగా ఫైనల్‌లో అడుగు పెట్టింది. రెండో సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫైనల్‌కు వర్షం ముప్పు..
అయితే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు(Navi Mumbai Weather) పొంచి ఉంది. భారీ వర్షం లేకున్నా.. చిరు జల్లులు ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఉన్న చిరు జల్లులు పడ్డాయి. కానీ మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కానీ ఆదివారం 30-60శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది.
రిజర్వ్ డే ఉంటుందా..?
వర్షం వల్ల ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే(Reserve Day) ప్రకటిస్తారు. ఆగిపోయిన ఓవర్ల నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకసారి టాస్ పడిదంటే.. ఆ మ్యాచ్ లైవ్‌గానే పరిగణిస్తారు. అయితే సోమవారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే ఐసీసీ రూల్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్‌వర్త్ లూయిన్ పద్ధతిలో ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల ఆట ఆడేలా చూస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. కానీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీ ఫైనల్‌కు అలాంటి పరిస్థితి అయితే లేదు.
గెలుపెవరిదో..
బలమైన ఆసీస్‌ను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఫైనల్‌లో సౌతాఫ్రికా(India vs South Africa Final)ను ఓడించడం అంత కష్టమేమీ కావచ్చు. సెమీస్ తరహాలోనే సమష్టిగా రాణిస్తే విజయం సాధించొచ్చు. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉండాలి. కట్టడిగా బౌలింగ్ చేయాలి. అంతే పదునుగా ఫీల్డింగ్ ఉండాలి. సమష్టిగా ఉన్నప్పుడు జట్టుకు గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఆ జట్టు కూడా తొలి టైటిల్ కోసం గట్టిగా పోరాడనుంది.
సౌతాఫ్రికా జట్టు గ్రూప్ దశలో 7 మ్యాచ్‌లలో 5 గెలిచి సెమీఫైనల్ చేరగా.. భారత్ జట్టు మాత్రం 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. టీమిండియాలో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, యువ ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ప్రధాన బలంగా మారింది. సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు కూడా భారత జట్టుకు గొప్ప ప్రేరణ అవుతుంది. అంతేకాకుండా నవీ ముంబై వేదికగానే గత నాలుగు మ్యాచ్‌లను భారత్ ఆడటం కలిసొచ్చే అంశం.
ఈ వార్తలు కూడా చదవండి:
IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..
Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్