IND VS AUS Semi Final: భారత్, ఆసీస్ సెమీ ఫైనల్ రద్దైతే.. ఫైనల్ చేరే జట్టు ఇదే?
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:08 AM
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎలాగైనా ఆసీస్ ను ఓడించి.. ఫైనల్ కు చేరాలని టీమిండియా కసిగా ఉంది. అది అంత ఈజీ కానప్పటికీ... కాస్తా శ్రమిస్తే సుసాధ్యం అవుతుందని క్రీడా నిపుణుల చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే... ఈ మ్యాచ్ వాన గండం ఉంది.
క్రీడా వార్తలు: మహిళా ప్రపంచ కప్(Women’s World Cup 2025)లో భాగంగా నేడు(అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎలాగైనా ఆసీస్ ను ఓడించి.. ఫైనల్ కు చేరాలని టీమిండియా(India vs Australia) కసిగా ఉంది. అది అంత ఈజీ కానప్పటికీ...కాస్తా శ్రమిస్తే సుసాధ్యం అవుతుందని క్రీడా నిపుణుల చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే... ఈ మ్యాచ్ కి వాన గండం ఉంది. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో అనేక మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇప్పుడు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వర్షపు మేఘాలు కప్పేశాయి. టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆగితే ఏం జరుగుతుంది. ఏ జట్టు ఫైనల్ కు వెళ్తుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులకు రిజర్వ్ డే ఉంది. మ్యాచ్ షెడ్యూల్ చేసిన రోజున జరగకపోతే, మ్యాచ్ రిజర్వ్ డే(Reserve Day)లో జరుగుతుంది. మ్యాచ్ రిజర్వ్ డేలో కూడా జరగకపోతే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్(Australia Women’s Cricket)కు ప్రవేశిస్తుంది. లీగ్ దశలో శ్రీలంక మ్యాచ్ తప్పా.. మిగిలిన అన్ని జట్లపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. శ్రీలంకతో జరగాల్సి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్(Second Semi-Final) గురువారం ముంబైలోని DY పాటిల్ స్టేడియాంలో జరుగుతుంది. మ్యాచ్ రోజున ముంబైలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Rain Forecast) తెలిపింది. అలాగే, రాబోయే 48 నుంచి 72 గంటల్లో, బలమైన గాలులతో ముంబైలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది భారత్, ఆసీస్ మధ్య జరిగే రెండవ సెమీఫైనల్‌ను ప్రభావితం చేయవచ్చు. మ్యాచ్ రోజున, మధ్యాహ్నం నాటికి 69 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం 3.8 మి.మీ. గురువారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదించింది. రిజర్వ్ డే అక్టోబర్ 31న కూడా ముంబైలో(Mumbai, DY Patil Stadium) వర్షం పడే అవకాశం ఉంది.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్