Share News

Rain Disrupts First T20: సూర్య ప్రతాపంపై నీళ్లు

ABN , Publish Date - Oct 30 , 2025 | 03:24 AM

చాన్నాళ్ల తర్వాత ఫామ్‌ దొరకబుచ్చుకున్న టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్‌) జోష్‌పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఎడతెగని వర్షం కారణంగా ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య...

Rain Disrupts First T20: సూర్య ప్రతాపంపై నీళ్లు

  • వరుణడిదే పైచేయి

  • ఆసీ్‌స-భారత్‌ తొలి టీ20 రద్దు

కాన్‌బెర్రా: చాన్నాళ్ల తర్వాత ఫామ్‌ దొరకబుచ్చుకున్న టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్‌) జోష్‌పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఎడతెగని వర్షం కారణంగా ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య తొలి టీ20 అర్ధంతరంగా రద్దయింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 9.4 ఓవర్లలో 97/1 స్కోరు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్‌), సూర్య రెండో వికెట్‌కు 35 బంతుల్లో 62 పరుగులు జోడించారు. అంతకుముందు 5 ఓవర్లు పూర్తవగానే సుమారు 40 నిమిషాలపాటు వాన ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. కానీ ఆ తర్వాత మరోసారి మొదలైన వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండో టీ20 శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరగనుంది.

అభిషేక్‌ విఫలం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అభిషేక్‌ శర్మ (14 బంతుల్లో 4 ఫోర్లతో 19) అదిరే ఆరంభాన్ని అందించలేక పోయాడు. 4వ ఓవర్‌లో ఎల్లిస్‌ బౌలింగ్‌లో గిల్‌ 2 ఫోర్లతో జోరు చూపినా.. పేలవ షాట్‌ ఆడిన అభిషేక్‌ మిడాన్‌లో డేవిడ్‌కు క్యాచిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య ఐదో ఓవర్‌లో హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో 92 మీటర్ల దూరంలో భారీ సిక్స్‌ బాది స్టేడియంలో జోష్‌ తీసుకొచ్చాడు. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ఫిలిప్స్‌ క్యాచ్‌ చేజార్చడంతో సూర్యకు లైఫ్‌ లభించింది. ఇక, పదో ఓవర్‌లో ఎల్లిస్‌ బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు, ఓ సిక్స్‌ సాధించాడు. అతడి దూకుడు చేస్తే భారీ స్కోరు ఖాయమనుకొంటున్న తరుణంలో వర్షం అడ్డుపడింది.


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (సి) డేవిడ్‌ (బి) ఎల్లిస్‌ 19, గిల్‌ (నాటౌట్‌) 37, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 9.4 ఓవర్లలో 97/1; వికెట్‌ పతనం: 1-35; బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 3-0-24-0, బార్ట్‌లెట్‌ 2-0-16-0, ఎల్లిస్‌ 1.4-0-25-1, స్టొయినిస్‌ 1-0-10-0, కునేమన్‌ 2-0-22-0.

టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా సూర్యకుమార్‌. 86 ఇన్నింగ్స్‌లో 1649 బంతుల్లో స్కై ఈ మైలురాయిని అందుకొన్నాడు. యూఏఈ ఆటగాడు వసీం 66 ఇన్నింగ్స్‌లో 1543 బంతుల్లోనే 150 సిక్స్‌ల మార్క్‌ను చేరాడు. కానీ, అతడి రికార్డును అసోసియేట్‌ మెంబర్‌గా ఐసీసీ నమోదు చేసింది. ఓవరాల్‌గా 150, అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జాబితాలో రోహిత్‌ (205 ఇన్నింగ్స్‌), వసీం (187), గప్టిల్‌ (173), బట్లర్‌ (172) సూర్య కంటే ముందున్నారు.

Also Read:

రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్

సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్

Updated Date - Oct 30 , 2025 | 03:24 AM