Share News

Donald Trump-South Korea: ట్రంప్ బంపరాఫర్.. ఇక, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:42 AM

దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంపారాఫర్ ఇచ్చారు. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల్ని నిర్మించడానికి సౌత్ కొరియాకు 'ఆమోదం' తెలిపారు. సౌత్ కొరియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో..

Donald Trump-South Korea: ట్రంప్ బంపరాఫర్.. ఇక, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు
Donald Trump, South Korea, nuclear submarines

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంపారాఫర్ ఇచ్చారు. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల్ని నిర్మించడానికి సౌత్ కొరియాకు 'ఆమోదం' తెలిపారు. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ అవగాహనకు వచ్చారు.

ఈ ఒప్పందం గురించి స్పందించిన ట్రంప్ .. 'మా సైనిక కూటమి గతంలో కంటే బలంగా ఉంది. ఇప్పుడు కలిగి ఉన్న పాతకాలపు, చాలా తక్కువ చురుకైన, డీజిల్-శక్తితో నడిచే జలాంతర్గాములను కాకుండా, అణుశక్తితో నడిచే జలాంతర్గామిని నిర్మించడానికి వారికి అనుమతి ఇచ్చాను' అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.


తదుపరి పోస్ట్‌లో ట్రంప్.. ఈ జలాంతర్గాముల్ని అమెరికాలో, ముఖ్యంగా 'ఫిలడెల్ఫియా షిప్‌యార్డ్స్'లో నిర్మిస్తామని ప్రకటించారు. ఉత్తర కొరియా, చైనా జలాంతర్గాములతో పోటీ పడేలా సౌత్ కొరియా వీటిని నిర్మించాలనుకుంటుందని ట్రంప్ చెప్పారు. ఫలితంగా దక్షిణ కొరియా కంపెనీలు, వ్యాపారవేత్తలు 600 బిలియన్ డాలర్లకు మించి అమెరికాలో పెట్టుబడులు పెడతారని కూడా ట్రంప్ అన్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందన్నారు.

ఈ పరిణామం మీద సౌత్ కొరియా సంతోషం వ్యక్తం చేసింది. 'అణుశక్తితో నడిచే జలాంతర్గాములకు ఇంధనాన్ని ఇవ్వడానికి అధ్యక్షుడు ట్రంప్ మాకు అనుమతి ఇస్తే, మేము దానిని ఎంతో అభినందిస్తాం' అంటూ బుధవారం ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశానికి ముందు లీ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ అణు సబ్‌మెరైన్‌లు దక్షిణ కొరియా నావికాదళానికి అధునాతన సాంకేతికతను అందిస్తాయి. ఉత్తర కొరియా, చైనా వంటి ప్రత్యర్థులతో పోటీ పడటానికి సహాయపడతాయి. అంతేకాదు, అమెరికాకు ఈ డీల్ ఆ దేశంలోని షిప్‌యార్డ్‌ల పునరుజ్జీవనానికి, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. అయితే, ఆసియాలో సైనిక పోటీ మరింత తీవ్రమవుతుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ తాజా పరిణామం యుఎస్- సౌత్ కొరియా మైత్రిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్టవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 08:58 AM