WBBL Controversial Decision:3 పరుగులు చేస్తే విజయం.. అంతలోనే అంపైర్ల షాకింగ్ నిర్ణయం!
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:13 PM
ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి కారణమైంది. సిడ్నీ జట్టు గెలుపుకు 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో ఫీల్డ్ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డయోనిసియస్ వర్షం వల్ల ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో జరిగే క్రికెట్ లీగ్స్ లో ఉమెన్ బిగ్‌బాష్(WBBL 2026) లీగ్ ఒకటి. ఈ టోర్నీకి అక్కడ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా డబ్యూబీబీఎల్ ప్రారంభమైంది. ఈ లీగ్ లో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం(WBBL controversial decision) అందర్నీ షాక్ కి గురి చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైక్స్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను అయిదు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన సిడ్నీ జట్టు ఆడిలైడ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 5 ఓవర్లకు ఆడిలైడ్ జట్టు 45 పరుగులకు చేసింది. ఈనేపథ్యంలో 5 ఓవర్లలో 46 పరుగులు చేస్తే సిడ్నీ జట్టుదే విజయం.
సిడ్నీ జట్టు(Sydney Thunder) 2.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కెప్టెన్ లిచీఫీల్డ్ 15 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు జార్జియా వోల్ కూడాక్రీజులో ఉంది. సిడ్నీ జట్టు గెలుపుకు 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో ఫీల్డ్ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డయోనిసియస్ ఇద్దరూ చర్చించుకుని వర్షం వల్ల ఆటను నిలిపివేస్తున్నట్లు(WBBL shock umpire call) ప్రకటించారు. దీంతో బ్యాటర్లతో సహా గ్రౌండ్ లోని ప్రేక్షకులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అలానే అంపైర్ల నిర్ణయాన్ని సిడ్నీ టీమ్(Sydney Thunder) అసలు జీర్ణించుకోలేకపోయింది. క్రీజులో ఉన్న బ్యాటర్లు లిచీఫీల్డ్, జార్జియా విస్మయానికి గురయ్యారు. కామెంటేటర్లు కూడా అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. గత 15 నిమిషాలుగా వర్షం కురుస్తున్నా.. అంపైర్లు ఆటను కొనసాగించారని కామెంటేటర్లు అన్నారు. కానీ సిడ్నీ జట్టుకు విజయానికి కేవలం 3 పరుగులే అవసరమైన వేళ మాత్రం అకస్మా్తుగా మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. అంపైర్ల తీరుపై నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!