WPL 2026 Schedule Released: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:50 PM
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించిన క్రీజీ న్యూస్ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ లీగ్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. జనవరి 9న ముంబై, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తో సీజన్ ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 026) ఆక్షన్ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లీగ్ కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వచ్చింది. డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) విడుదల చేసింది. ఈ సీజన్ జనవరి 9న నవీముంబయి వేదికగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్(Mumbai Indians vs RCB)తో ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ వడోదర వేదికగా ఫిబ్రవరి 5న జరగనుంది. డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లన్నీ ఈ రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పోటీ పడనున్నాయి. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.
డబ్ల్యూపీఎల్(Women’s Premier League 2026) సీజన్ 28 రోజుల పాటు సాగనుంది. తొలి దశ మ్యాచ్ లకు డీవై పాటిల్ స్డేడియం, రెండో దశ మ్యాచులు, ప్లే ఆఫ్స్ నకు కొటాంబి స్డేడియం వేదికలు అని బీసీసీఐ తెలిపింది. గతేడాది ముంబై, బెంగళూరు, లక్నో వేదికగా ఈ లీగ్ మ్యాచులు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం(నవంబర్ 27న) డబ్ల్యూపీఎల్ సీజన్ 2026 వేలం ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ ఆక్షన్ లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ( Dipti Sharma) అత్యధిక ధర(రూ.3.20 కోట్లు) పలికారు. ఆమెను యూపీ వారియర్స్ ఆర్‌టీఎం కార్డు ఉపయోగించి తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను రూ.3 కోట్లకు ముంబయి ఇండియన్స్, భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేను(Shikha Pandey WPL Auction) రూ.2.40 కోట్లకు యూపీ కొనుగోలు చేశారు. అలానే న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ తీసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!