Tai Tzu Ying: బ్యాడ్మింటన్‌కు చైనీస్ స్టార్ ప్లేయర్ తైజు వీడ్కోలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:50 AM
చైనీస్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తైజు యింగ్ (31) తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె మణికట్టు మాయాజాలానికి ప్రసిద్ధి. నెట్ దగ్గర ఆమె చేసే విన్యాసాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆటలో ఇక కొనసాగకూడదని తైజు నిర్ణయించుకుంది.
చైనీస్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తైజు యింగ్(Tai Tzu Ying)(31) తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె మణికట్టు మాయాజాలానికి ప్రసిద్ధి. నెట్ దగ్గర ఆమె చేసే విన్యాసాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కొంతకాలంగా గాయాలతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆటలో ఇక కొనసాగకూడదని తైజు నిర్ణయించుకుంది. 2024 ఇండియా ఓపెనే ఆమెకు కెరీర్‌లో చివరి టోర్నీ కావడం గమన్హారం. తన రిటైర్మెంట్ గురించి తైజు(Tai Tzu Ying) ఇన్ స్టాలో వెల్లడించారు. ఓ అందమైన అధ్యాయానికి తెరపడిందని, బ్యాడ్మింటన్‌కు కృతజ్ఞతలని, ఈ ఆట తనకు అన్నీ ఇచ్చిందని తైజు ఇన్‌స్టాలో పేర్కొంది. తైజు బ్యాడ్మింటన్(Badminton)కు వీడ్కోలు చెప్పడంపై భారత స్టార్ పీవీ సింధు స్పందించింది.
'గత 15 ఏళ్లలో నీతో తలపడిన ప్రతిసారి ఎంతో శ్రమించేలా చేశావ్. 2016లో రియో ఒలింపిక్స్, 2019 బాసెల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం సాధించే క్రమంలో నీతో మారథాన్ మ్యాచ్‌లు ఆడాను. 2021 ఆసియా క్రీడల్లో స్వర్ణ పోరులోనూ గొప్పగా పోరాడావు. నీ మణికట్టు ఆట, ప్రత్యర్థిని మాయ చేసే షాట్లు పెద్ద సవాల్‌గా అనిపించేవి'అని సింధు(PV Sindhu Tribute) పోస్టు పెట్టింది. తైజు 2020 టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో రజతం, 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచింది. ఇక ఆమె రిటైర్మెంట్ ప్రకటించడంతో తైజు అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఆమె ఇంకా చాలా కాలం తన ఆటతో అలరిస్తుందని భావించారు.
ఇవి కూడా చదవండి:
Richa Ghosh: వన్డే ప్రపంచ కప్ విజేతకు డీఎస్పీ పదవి
లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..