Richa Ghosh: వన్డే ప్రపంచ కప్ విజేతకు డీఎస్పీ పదవి
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:30 AM
శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో రిచాను సన్మానించి ఆమెకు రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు ‘బంగ భూషణ్’ను అక్కడి ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేతులు మీదుగా రిచా అందుకుంది. అంతేకాక ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా నియమిస్తూ మమత ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.
దశాబ్దాల భారతీయుల కల నెరవేరింది. మహిళల ప్రపంచ కప్ ను ముద్దాడాలనే టీమిండియా జట్టు కోరిక నేరవేరింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు సభ్యులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అదే విధంగా వివిధ వివిధ రాష్ట్రాలు టీమిండియా జట్టు సభ్యులకు భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి. అలానే కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో కీలక సభ్యురాలైన వికెట్‌కీపర్ రిచా ఘోష్(Richa Ghosh)కు కూడా ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నజరానాలు ప్రకటించింది.
శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో రిచా(Richa Ghosh)ను సన్మానించి ఆమెకు రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు ‘బంగ భూషణ్’ను అక్కడి ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేతులు మీదుగా రిచా అందుకుంది. అంతేకాక ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా నియమిస్తూ మమత ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. అలానే రిచాకు గోల్డ్ హారం ఇవ్వడంతో పాటు ఫైనల్లో సౌతాఫ్రికా(South Africa)పై ఆమె చేసిన 34 పరుగులకు గుర్తుగా రూ.34 లక్షల నగదును కూడా అందజేశారు. మరోవైపు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) గోల్డ్ బ్యాట్, బాల్‌ను రిచాకు అందజేసింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్న తొలి బెంగాల్ క్రికెటర్(Bengal Cricketer) రిచానే కావడం గమన్హారం.
2003లో సౌరభ్ గంగూలీ ఆ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. రిచాను సన్మానించే సందర్భంలో క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాట్లాడుతూ...' రిచా బెంగాల్‌ను గర్వించేలా చేసింది. మున్ముందు కూడా ఆమె ఇలాగే రాణిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఒత్తిడిని ఆస్వాదించానని, నెట్స్‌లోనూ ఒక సమయం నిర్దేశించుకుని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించేలా సాధన చేస్తుంటానని రిచా తెలిపింది. ఈ కార్యక్రమంలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచకప్‌లో రిచా 8 ఇన్నింగ్స్‌ల్లో 235 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..