IPL Playoff Race: రైజర్స్ కథ ముగిసినట్టే
ABN , Publish Date - May 03 , 2025 | 04:45 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి చెందింది. ప్లేఆఫ్స్ ఆశలు తరుచూ వదులుకున్న సన్‌రైజర్స్ 7 ఓటములతో కఠిన పరిస్థితుల్లో ఉంది.

ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ సంక్లిష్టం
38 రన్స్ తేడాతో గుజరాత్ విజయం
గిల్, బట్లర్ హాఫ్‌సెంచరీలు జూ పోరాడిన అభిషేక్
టీ20ల్లో వేగంగా (54 ఇన్నింగ్స్) 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా సుదర్శన్. ఓవరాల్‌గా మార్ష్ (53) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే (2677) 4 వేల రన్స్ పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా బట్లర్. గేల్ (2653), డివిల్లీర్స్ (2658) ముందున్నారు.
అహ్మదాబాద్: ప్లేఆఫ్స్ బెర్త్‌పై ఆశలను పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఝలక్ తగిలింది. మిగిలిన ఐదు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిన వేళ.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 38 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దీంతో ఏడు ఓటుముల కారణంగా ఆరు పాయింట్లతో ఉన్న కమిన్స్ సేన సాంకేతికంగా రేసులో ఉన్నా.. నాకౌట్ చేరడం దాదాపు అసాధ్యమే. అటు సొంతగడ్డపై ఆల్‌రౌండ్‌షో కనబర్చిన గిల్ బృందం 14 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), బట్లర్ (37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 64), సుదర్శన్ (23 బంతుల్లో 9 ఫోర్లతో 48) రాణించారు. ఉనాద్కట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసి ఓడింది. అభిషేక్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 74), క్లాసెన్ (23) మాత్రమే ఆకట్టుకున్నారు. ప్రసిద్ధ్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రసిద్ధ్ నిలిచాడు.
అభిషేక్ ఒక్కడే..: భారీ ఛేదనలో రైజర్స్ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. ఓపెనర్ అభిషేక్ మినహా మరే బ్యాటర్ ఆకట్టుకోలేదు. పేసర్ ప్రసిద్ధ్ షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బందిప్టెగా, స్పిన్నర్ రషీద్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. అభిషేక్ మెరుపులకు తొలి నాలుగు ఓవర్లలో జట్టు 45 పరుగులతో మెరుగ్గానే కనిపించింది. కానీ ఆ తర్వాత టైటాన్స్ బౌలర్లు కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో 57 పరుగులకే పరిమితమైంది. అటు మరో ఓపెనర్ హెడ్ (20) ఐదో ఓవర్‌లో రషీద్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. కాసేపటికే ఇషాన్ (13)ను పేసర్ కొట్జీ అవుట్ చేయగా మధ్య ఓవర్లలో రైజర్స్ మరింతగా ఇబ్బందిపడింది. అభిషేక్‌కు జతగా క్లాసెన్ క్రీజులో ఉన్నా పరుగులు రావడం కష్టమైంది. అభిషేక్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు చేయాల్సిన రన్‌రేట్ పెరుగుతుండడంతో భారీ షాట్‌కు వెళ్లిన అభిషేక్.. సిరాజ్ సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆ వెంటనే క్లాసెన్‌ను ప్రసిద్ధ్ అవుట్ చేయడంతో రైజర్స్ ఆశలు వదులుకుంది. దీనికి తోడు 17వ ఓవర్‌లో అనికేత్ (3), కమిందు (0)లను సిరాజ్ వరుస బంతుల్లో వెనక్కిపంపాడు. ఆఖర్లో నితీశ్ (21 నాటౌట్), కమిన్స్ (19 నాటౌట్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి.
చెలరేగిన టాపార్డర్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఎప్పటిలాగే టాపార్డర్ నుంచి సహకారం లభించింది. ఓపెనర్ గిల్ సిక్సర్‌తో తొలి ఓవర్‌లోనే 11 పరుగులు సాధించిన టైటాన్స్.. మూడో ఓవర్‌లో సుదర్శన్ ఐదు ఫోర్లతో 20 పరుగులు అందుకుంది. అనంతరం గిల్ 4,4,6తో కమిన్స్ 17 రన్స్ సమర్పించుకున్నాడు. హర్షల్ ఓవర్‌లోనూ సుదర్శన్ నాలుగు ఫోర్లతో 18 రన్స్ రాబట్టాడు. దీంతో గుజరాత్ జట్టు పవర్‌ప్లేలో 82 పరుగులతో తమ అత్యధిక స్కోరును పూర్తి చేసింది. అనంతరం జోరు మీదున్న సుదర్శన్‌ను స్పిన్నర్ జీషన్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు గిల్ మాత్రం షమి ఓవర్‌లో 4,4తో 25 బంతుల్లోనే హ్యాట్రిక్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే 13వ ఓవర్‌లో తను రనౌట్ కావడంతో రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్‌లో 6,4తో బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే స్కోరు 200 దాటినా, ఆఖరి రెండు ఓవర్లలో టైటాన్స్ తడబడి బట్లర్, సుందర్, తెవాటియా (6), రషీద్ (0)ల వికెట్లను కోల్పోయింది. అయినా ఈ 12 బంతుల్లో 21 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
స్కోరుబోర్డు
గుజరాత్: సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) జీషన్ 48; గిల్ (రనౌట్) 76; బట్లర్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 64; సుందర్ (సి) నితీశ్ (బి) ఉనాద్కట్ 21; షారుక్ (నాటౌట్) 6; తెవాటియా (సి) అనికేత్ (బి) ఉనాద్కట్ 6; రషీద్ (సి అండ్ బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 224/6. వికెట్ల పతనం: 1-87, 2-149, 3-206, 4-218, 5-224, 6-224; బౌలింగ్: షమి 3-0-48-0; ఉనాద్కట్ 4-0-35-3; కమిన్స్ 4-0-40-1; హర్షల్ 3-0-41-0; జీషన్ 4-0-42-1; కమిందు 2-0-18-0.
హైదరాబాద్: హెడ్ (సి) రషీద్ (బి) ప్రసిద్ధ్ 20, అభిషేక్ (సి) సిరాజ్ (బి) ఇషాంత్ 74, ఇషాన్ (సి) ప్రసిద్ధ్ (బి) కొట్జీ 13, క్లాసెన్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ధ్ 23, అనికేత్ (సి) షారుఖ్ (బి) సిరాజ్ 3, నితీష్ కుమార్ (నాటౌట్) 21, మెండిస్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 0, కమిన్స్ (నాటౌట్) 19, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం: 20 ఓవర్లలో 186/6; వికెట్లపతనం: 1-49, 2-82, 3-139, 4-141, 5-145, 6-145, బౌలింగ్: సిరాజ్ 4-0-33-2, ఇషాంత్ శర్మ 3.2-0-35-1, ప్రసిద్ధ్ కృష్ణ 4-0-19-2, కొట్జీ 4-0-36-1, సుందర్ 1-0-6-0, రషీద్ 3-0-50-0, సాయి కిషోర్ 0.4-0-1-0.