Ind Vs SA: ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: కెప్టెన్ మార్క్‌రమ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 06:44 AM
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సఫారీ సేన.. 117 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు(Ind Vs SA) చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌కి దిగిన టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించడంతో సౌతాఫ్రికా స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఆ పై ఛేదనకి దిగిన భారత్.. మూడు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే ఆటను ముగించింది. తమ ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్(Markram) మాట్లాడాడు.
‘బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. మేం వరుసగా ఐదు వికెట్లు కోల్పోయాం. భారత బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. టెస్ట్ మ్యాచ్ తరహాలో బంతులు సంధించారు. వాటిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమికి కారణమైంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కోవడానికి.. తిరిగి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలి’ అని మార్క్‌రమ్ వెల్లడించాడు.
అవకాశమే దక్కలేదు..
‘భారత్(Team India) మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. వారు మాకు పరుగులు చేసే అవకాశమే దక్కలేదు. నేను ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను. నేను ఇంకాస్త దూకుడు పెంచి 140-150 పరుగుల స్కోరు జట్టుకు అందించి ఉంటే.. మ్యాచ్ రసవత్తరంగా జరిగేది. డెత్ ఓవర్లలోనే నేను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదే. ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్‌ను ఎంచుకోవాలి. అందరిపై ఎదురుదాడి చేయకుండా ఒక్క బౌలర్‌పై మాత్రమే విరుచుపడాలి’ అని తెలిపాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సఫారీల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్