Smriti unfollowed Palas: ఇన్‌స్టాలో పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి! నిజం ఏంటంటే..
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:25 AM
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. పలాశ్ ను ఇన్ స్టా లో అన్ ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana), మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే స్మృతి తండ్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ వివాహ వేడుకను వాయిదా వేశారు. పెళ్లి ఆగిపోయిన కొద్ది రోజులకే పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పలాశ్ ను స్మృతి మందాన ఇన్ స్టాలో అన్ ఫాలో(Instagram rumors) చేసిందనే పుకారు షికారు చేస్తోంది. ఈ రూమర్స్ కు సంబంధించి అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం...
స్మృతి మందాన పలాశ్ ముచ్చల్(Palash Muchhal) ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయలేదని ఓ జాతియ మీడియా స్పష్టం చేసింది. ఇప్పటికే అతడిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుందని వెల్లడించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్క్రీన్ షాట్ సైతం సదరు మీడియా పెట్టింది. స్మృతి.. పలాశ్‌ను అన్ ఫాలో చేయలేదు.. కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి వివాహానికి సంబంధించిన అన్ని పోస్ట్‌లను తొలగించింది.
హాల్దీ, సంగీత్ వేడుకల్లో వీరు చేసిన డ్యాన్స్, ఆమె తోటి క్రికెటర్లు(Cricketers) చేసిన సందడికి సంబంధించిన అన్ని వీడియోలను స్మృతి తన అకౌంట్ నుంచి తొలగించింది. దీంతో అమె ఇన్ స్టా అకౌంట్(Instagram Account) లో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కనిపించడం లేదు. స్మృతి చేసిన ఈ చర్య సోషల్ మీడియాలో మరింత అనుమానాలను పెంచింది. దీనితో ఏం జరిగింది?, పెళ్లిలో ప్రాబ్లమ్స్ వచ్చాయా? అంటూ నెటిజన్లు అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి:
వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?
ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా