Share News

Shivam Dube Six: గంభీర్ మెసేజ్.. అదిరిపోయే సిక్స్ కొట్టిన శివం దూబే

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:01 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్ 167 పరుగులు చేసింది. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ శివం దూబే కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు.

Shivam Dube Six: గంభీర్ మెసేజ్.. అదిరిపోయే సిక్స్ కొట్టిన శివం దూబే
Shivam Dube six

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్( India vs Australia) 167 పరుగులు చేసింది. టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ గిల్ (46) తృటిలో హాఫ్ సెంచరీ ని మిస్ చేసుకున్నాడు. అంతేకాక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(20) స్వల్ప స్కోర్ కే వెనుదిరిగి నిరాశపరిచాడు. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ శివం దూబే కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన సిక్సర్ కు బంతి స్టేడియంపై పడింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ అద్భుతమైన బౌండరీ కొట్టే ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. శివం దూబెకు ఓ సందేశం పంపినట్లు తెలుస్తుంది. బెంచ్ మీద ఉన్న సహచరుడు రింకూ సింగ్(Rinku Singh) ద్వారా గౌతమ్ గంభీర్ మెసేజ్ పంపారు. డ్రింక్ తీసుకుని దూబే వద్దకు వచ్చిన రింకూ సింగ్.. అతనికి ఏదో చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయాడు. తర్వాత కాసేపటికే శివం దూబే అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.


ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌(Adam Zampa)లో దూబే ఈ అద్భుతమైన సిక్స్ ను కొట్టాడు. ఆ సమయంలో జంపా బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల టాస్-అప్ డెలివరీ ఇచ్చాడు. శివం దూబే తన పూర్తి బలాన్ని ప్రదర్శించి.. ఆ బంతిని కొట్టడంతో ఓవల్ వెలుపలికి వెళ్లింది. అయితే మంచి ఫామ్ లో కనిపించిన శివం దూబే 12వ ఓవర్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దూబే 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 22 పరుగులు చేశాడు. మొత్తంగా శివం దూబే(Shivam Dube) కొట్టిన బౌండరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఖరారు.. ఆందోళనలో భారత్ అభిమానులు!

IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2025 | 06:28 PM