T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఖరారు.. ఆందోళనలో భారత్ అభిమానులు!
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:24 PM
భారత్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద గ్రౌండైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఫైనల్ వేదికగా ఖరారు చేసినట్లు సమాచారం.
క్రీడా వార్తలు: క్రికెట్‌కు సంబంధించిన ప్రతి అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా పురుషుల టీ 20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. భారత్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద గ్రౌండైన అహ్మదాబాద్( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఫైనల్ వేదికగా ఖరారు చేసినట్లు సమాచారం. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్- 2025 ముగిసిన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026(India T20 World Cup)షెడ్యూల్‌పై ఐసీసీ కసరత్తులు చేస్తోంది.
తాజా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో ఫైనల్(Ahmedabad final) అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యా్న్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఓడింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా భారత్ ఫైనల్ కి చేరింది. లీగ్ దశలో అన్ని మ్యాచులు గెలవడంతో ఫైనల్ లో కూడా భారత్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఫైనల్‌ను అచ్చొచ్చిన ముంబై వేదికగా నిర్వహించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇక టీ 20 వరల్డ్ కప్(T20 World cup 2026) విషయానికి వస్తే. ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లు చేయనున్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిన ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఆడనుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8(Super-8)కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇక్కడ కూడా ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో తలపడుతుంది. రెండు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి.
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి అహ్మదాబాద్, కోల్‌కతా(Kolkata), చెన్నై, ముంబై(Mumbai) నగరాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. ఒక్కో వేదికగా 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారం కారణంగా పాకిస్థాన్ మ్యాచ్‌లు శ్రీలంక(Srilanaka) వేదికగా జరగనున్నాయి. కొలంబో, పల్లెకెలె, గాలే వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ పాకిస్థాన్(Pakistn) ఫైనల్ చేరితే తుది పోరుకు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్
IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి