IND VS AUS: ముగిసిన భారత్ బ్యాటింగ్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 06 , 2025 | 03:44 PM
క్వీన్స్‌ల్యాండ్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది.
క్వీన్స్‌ల్యాండ్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య(IND VS AUS) నాలుగో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(Shubman Gill) 46 పరుగులతో రాణించాడు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) 28, శివమ్ దూబే 22, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 20 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అలానే మార్కస్, జేవియర్ బార్ట్‌లెట్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. మొత్తంగా ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల టార్గెట్ ను భారత్ జట్టు ఉంచింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచును గెలిచాయి. అలానే ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడారు. అభిషేక్ 21 బంతుల్లో 28 పరుగులు చేసి.. జంపా బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం శివం దూబెతో కలిసి గిల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 39 బంతుల్లో 46 పరుగులు చేసిన గిల్.. తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో గిల్ పెవిలియన్ చేరాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కేవలం 5 పరుగులే చేసి.. ఔటయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్(Axar Patel)(21), వాషింగ్టన్ సుందర్(Washington Sundar)(12) రాణించడంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్
IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి