India Eye Series Lead Against Australia: భారత్‌కు భలే చాన్స్
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:09 AM
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకొనేందుకు భారత్‌కు అద్భుత అవకాశం. ఐదు టీ20ల సిరీస్ 1 1తో సమమైన నేపథ్యంలో గురువారం..
ఆధిక్యంపై సూర్య సేన గురి
గిల్ ఫామ్ ఆందోళనకరం
కరార (గోల్డ్‌కోస్ట్): ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకొనేందుకు భారత్‌కు అద్భుత అవకాశం. ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో గురువారం జరిగే నాలుగో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సిరీస్ కోల్పోని స్థితిలో నిలవాలనుకొంటోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, పేసర్ హాజెల్‌వుడ్ సిరీ్‌సకు దూరమైన నేపథ్యంలో కంగారూల పనిపట్టడానికి సూర్యకుమార్ సేనకు ఇదో మంచి చాన్స్. అయితే, మూడో టీ20లో విజయంతో జోష్ మీదున్న భారత్‌కు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస వైఫల్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఆరు మ్యాచ్‌ల్లో గిల్ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేదు. ఫుల్లర్ డెలివరీలు ఆడేందుకు గిల్ ఇబ్బంది పడుతున్నాడు. వికెట్ల ముందు దొరికిపోవడం అతడి ప్రధాన బలహీనతగా మారింది. మరోవైపు అభిషేక్ శర్మ తనదైన శైలిలో అదరగొడుతున్నాడు. గిల్ అతడికి ఏమాత్రం సరితూగడం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ మెరుగ్గానే ఆరంభిస్తున్నా..భారీస్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ, సుందర్ నమ్మదగ్గ ప్లేయర్లుగా ఎదుగుతున్నారు. ఈ మ్యాచ్‌కు కూడా శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు కీపింగ్ బాధ్యతలు అప్పగించే చాన్సులున్నాయి. ఆల్‌రౌండర్ శివం దూబేతోపాటు అర్ష్‌దీప్, బుమ్రా పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నారు. మరోవైపు కెప్టెన్ మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ దూకుడైన ఆటపై ఆసీస్ ఎక్కువగా ఆధారపడుతోంది. హెడ్ స్థానంలో మాట్ షార్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. మ్యాక్స్‌వెల్ జట్టులోకి రావడం సానుకూల పరిణామం. అబాట్ బదులు డ్వార్షుయి్సకు చాన్స్ దక్కనుంది.
అతడికి అంతా తెలుసు: మోర్కెల్
టీ20ల్లో అర్ష్‌దీప్ కీలకమైన బౌలర్. కానీ, అతడికి ఈ టూర్లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్‌లో చోటుదక్కలేదు. అయితే, మేనేజ్మెంట్ ఉద్దేశమేంటో అర్ష్‌దీ్‌పనకు అర్థమయ్యే ఉంటుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. మరో మూడు నెలల్లో జరిగే టీ20 వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్మెంట్ జట్టును సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్న వనరులను పరీక్షిస్తోంది.
జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, సుందర్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
ఆస్ట్రేలియా: మాట్ షార్ట్, మార్ష్ (కెప్టెన్), ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచ్ ఓవెన్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, బ్రాట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లీస్, కునేమన్.