New Hire Gets Fired: మహిళ దొంగతనం.. జాబ్‌లో చేరిన మొదటిరోజే..
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:15 PM
ఓ మహిళ కొత్తగా జాబ్‌లో చేరింది. ఆఫీస్‌లో మొదటి రోజు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది. ఆమె చేసిన దొంగతనం కారణంగా అదే ఆమె చివరి రోజు అయింది.
జాబ్‌లో జాయిన్ అయిన మొదటి రోజే ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమె చేసిన దొంగ పనికి జాబ్ ఊడిపోయింది. ఆమె ఏం దొంగతనం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరీ ఇంత కక్కుర్తా అని అనక మానరు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో ఏముందంటే.. కొన్ని రోజుల క్రితం ఓ కంపెనీ ఓ మహిళను ఉద్యోగంలోకి తీసుకుంది.
ఆమె మొదటి రోజు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది. ట్రైనింగ్ సెషన్ సందర్బంగా ఆమె ఎందుకో భయపడుతూ ఉంది. బ్రేక్ సందర్బంగా ఉద్యోగులందరూ బ్రేక్ రూములో ఉంటే.. ఆమె మాత్రం కాఫీ మిషిన్ దగ్గరకు వెళ్లింది. అక్కడ రెండు చిన్న సంచుల నిండా కాఫీ గింజలు ఉన్నాయి. ఆమె వాటిని అటువైపు వచ్చే వారికి చూపిస్తూ.. ‘ఇవి ఎవరివీ’ అని అడగసాగింది. ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘ఇవి కంపెనీవి. ఎవరైనా ఫ్రీగా వాటిని వాడుకోవచ్చు’ అని చెప్పాడు.
ఆమె ఇంటికి వెళ్లేటప్పుడు ఆ రెండు సంచుల్ని తన పర్స్‌లో పెట్టుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజు వచ్చి చూస్తే అక్కడ కాఫీ గింజలు లేవు. ఆమె కాఫీ గింజల్ని తీసుకెళ్లటం ఓ వ్యక్తి చూశాడు. దాన్ని మేనేజర్‌కు చెప్పాడు. ఆమె రాగానే మేనేజర్ లోపలికి పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె బయటకు వచ్చింది. బ్యాగు సర్థుకుని బయటకు వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ ఆఫీస్‌కు తిరిగిరాలేదు. కాఫీ గింజల్ని దొంగిలించటం వల్ల ఉద్యోగంలో చేరిన మొదటి రోజే చివరి రోజుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
బాపట్లలో లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
అడవి గేదెపై సింహం దాడి.. చివరకు ఏం జరిగిందో చూడండి..