Rohit Sharma: మరో మూడు సిక్సులు కొడితే..! అరుదైన రికార్డుకు చేరువలో హిట్‌మ్యాన్
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:25 AM
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొడితే అత్యధిక సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. సఫారీలతో తొలి వన్డేలో ఈ ఫీట్ అందుకునే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి సౌతాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్(Rohit Sharma) ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు.
మూడంటే మూడే..
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సిక్స్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి పుల్ షాట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. హిట్‌మ్యాన్ మరో మూడు సిక్సులు కొడితే.. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రలోకెక్కుతాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. నేడు జరిగే తొలి వన్డేలో రోహిత్.. ఈ ఫీట్ అందుకునే అవకాశం ఉంది.
అత్యధిక సిక్సులు బాదింది వీరే..
1. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్)- 351 సిక్సులు
2. రోహిత్ శర్మ(భారత్)- 349 సిక్సులు
3. క్రిస్ గేల్(వెస్టిండీస్)-331 సిక్సులు
4. సనత్ జయసూర్య(శ్రీలంక)- 270 సిక్సులు
5. ఎంఎస్ ధోనీ(భారత్)- 229 సిక్సులు
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?