Share News

Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్‌

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:32 PM

కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రొటీస్ చేతిలో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్.. భారత్ ఓటమి గల కారణాలను వెల్లడించాడు.

Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్‌
Rishabh Pant

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను భారత్(India vs South Africa 1st Test) ఓటమితో ప్రారంభించింది. కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రొటీస్ చేతిలో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. గువాహటి వేదికగా రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో భారత్ నిలిచింది. మరోవైపు తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Risbah Pant) స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే టార్గెట్ ను ఛేదించే వాళ్లమని తమ ఫెయిల్యూర్ ను పంత్ అంగీకరించాడు.


మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్(Rishabh Pant) మీడియాతో మాట్లాడుతూ... ‘124 పరుగుల లక్ష్యాన్ని మేము ఛేదించి ఉండాల్సింది. టార్గెట్ చిన్నదే అయినా... రెండో ఇన్నింగ్స్‌లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. దాన్ని మేము అధిగమించ లేకపోయాము. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, బాష్‌.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారిద్దరు.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకున్నారు. ఇలాంటి పిచ్‌పై 120 పరుగులు చేయడం అంత ఈజీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో విఫలమయ్యాము. ఈ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’ అని పంత్ వెల్లడించాడు. మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్‌ మధ్యలోనే నిష్క్రమించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill injury).. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ పంత్‌.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.



ఇవి కూడా చదవండి:

IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం

Gambhir's Experiment Failure: భారత్ కొంపముంచిన ప్రయోగాలు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 05:32 PM