Share News

Rinku Singh Slams: రంజీ ట్రోఫీలో రింకూ సింగ్ ఊచకోత!

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:23 PM

దేశవాళీ రంజీ ట్రోఫీ‌ 2025లో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన బ్యాటింగ్‌తో సెంచరీల మోత మోగిస్తున్నాడు.

Rinku Singh Slams:  రంజీ ట్రోఫీలో రింకూ సింగ్ ఊచకోత!
Rinku Singh Ranji Trophy

రంజీ ట్రోఫీ‌లో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్(Rinku Singh Ranji Trophy) చెలరేగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన బ్యాటింగ్‌తో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ సింగ్.. బుధవారం తమిళనాడుతో డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో భారీ శతకంతో విజృంభించాడు. 247 బంతుల్లో17 ఫోర్లు, 6 సిక్స్‌లతో 176(Rinku Singh 176) పరుగుల భారీ స్కోర్ చేశాడు. అందరూ డబుల్ సెంచరీ చేస్తాడని భావించినా.. తృటిలో చేజార్చుకున్నాడు.


రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(UP vs Tamil Nadu Ranji match) తొలి ఇన్నింగ్స్‌లో 145.1 ఓవర్లలో 460 పరుగుల భారీ స్కోర్ చేసింది. 5 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు ఆఖరి రోజు(బుధవారం) ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితి లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో నిర్ణీత సమయం కంటే ముందే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 455 పరుగుల భారీ స్కోర్ చేసింది.


బాబా ఇంద్రజిత్(149), ఆండ్రూ సిద్దార్థ్(121) శతకాలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ భారీ శతకం(Rinku Singh century)తోనే యూపీ ఓటమిని తప్పించుకుంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కూడా రింకూ సింగ్ 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. తమిళనాడుపై చేసిన శతకం రింకూ సింగ్‌కు 9వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. వరుసగా రెండో 150+ స్కోర్. 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 59.07 సగటుతో రాణించిన రింకూ సింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. యూపీ తరఫున ఐదో స్థానంలో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్న రింకూ సింగ్‌ను టీమిండియాలో కూడా అదే స్థానంలో ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir India Team Plans) కు నెటిజన్లు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్‌ టీ20 జట్టు.. రోహిత్‌, కోహ్లి దక్కని చోటు!

ఎవరీ మిస్టరీ స్పిన్నర్?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 04:30 PM