Share News

RCB vs CSK: నేడు ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..

ABN , Publish Date - May 03 , 2025 | 10:07 AM

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చైన్నై ప్లేఆఫ్ రేసులో లేనప్పటికీ ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలకు కట్టడి చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RCB vs CSK: నేడు ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..
RCB vs CSK Today Match

నేడు IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK) జట్ల మధ్య 52వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇద్దరు కెప్టెన్లు రజత్ పాటిదార్, MS ధోని టాస్ వేయడానికి అరగంట ముందు మైదానంలోకి దిగుతారు. అందరికీ తెలిసినట్లుగా చెన్నై జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ వారి దృష్టి మాత్రం ప్రస్తుతం ఇతర జట్ల ప్లే ఆఫ్ సమీకరణాలను చెడగొట్టడంపై ఉందని చెప్పవచ్చు ఈ క్రమంలో RCB గెలుపుని కట్టడి చేయాలని చెన్నై చూస్తోంది. ఇదే సమయంలో ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది. RCB ప్రస్తుతం తన ఖాతాలో 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.


పిచ్ రిపోర్ట్

చిన్నస్వామి స్టేడియం ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామం. ఇక్కడ చిన్న బౌండరీలు ఉండటం వల్ల, అభిమానులు తరచుగా అధిక స్కోరింగ్ మ్యాచ్‌లను చూసే అవకాశం లభిస్తుంది. బంతి బౌన్స్‌పై ఆధారపడి బ్యాట్స్‌మెన్ ఇక్కడ పెద్ద షాట్లు ఆడగలరు. ఈ సంవత్సరం 4 మ్యాచ్‌ల్లో ఇక్కడ ఒక్కసారి మాత్రమే 200 పరుగుల మార్కును దాటింది. కానీ అభిమానులు RCB vs CSK మధ్య అధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆశించవచ్చు. ఇక్కడ 99 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్టు 53 సార్లు గెలిచింది. దీంతో ఈ రోజు ఇద్దరు కెప్టెన్లు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకునే ఛాన్సుంది.


RCB vs CSK హెడ్ టూ హెడ్

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో CSK 21 మ్యాచ్‌ల్లో గెలిచి ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలో నేటి మ్యాచులో కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ క్రమంలో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే నేటి మ్యాచులో ఆర్సీబీ జట్టు గెలిచేందుకు 62 శాతం అవకాశం ఉండగా, చెన్నై జట్టుకు 38 శాతం ఛాన్సుంది.

ఇరు జట్లలో ఆడే 11 మంది

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లి, జాకబ్ బెతెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్,

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ 11: షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్


ఇవి కూడా చదవండి:

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్


Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు


PM Modi: ఇక్కడ శశి థరూర్..ఇది కొంత మందికి నిద్ర కూడా పట్టదన్న ప్రధాని మోదీ


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Business News and Latest Telugu News

Updated Date - May 03 , 2025 | 11:00 AM