Share News

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..

ABN , Publish Date - May 03 , 2025 | 10:50 AM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు 52వ మ్యాచ్ మొదలుకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

RCB vs CSK Rain Update: ఆర్సీబీ vs సీఎస్‌కే మ్యాచుకు వర్షం ఎఫెక్ట్..రద్దైతే ఏంటి పరిస్థితి..
RCB vs CSK rain update

నేడు ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 52వ మ్యాచ్ జరగనుంది. శనివారం (మే 3న) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో కోహ్లీ, ధోనిల మధ్య ఇదే జరిగే చివరి మ్యాచ్ ఇదే కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సీజన్ తర్వాత ధోని ఈ లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడని అంటున్నాయి క్రీడా వర్గాలు. ఈ క్రమంలోనే RCB vs CSK మ్యాచ్ సమయంలో వర్షం పడే ఛాన్సుందని తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


వెదర్ రిపోర్ట్ ప్రకారం..

బెంగళూరులో గత 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ అంచనా ప్రకారం, బెంగళూరులో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగళూరులో వాతావరణం గురించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. బెంగళూరుకు రాబోయే ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటించారు. అక్యూవెదర్ ప్రకారం, CSK vs RCB మ్యాచ్‌ సమయంలో రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. వర్షం సకాలంలో ఆగిపోతే అభిమానులు ఖచ్చితంగా మ్యాచ్‌లోని కనీసం 5-5 ఓవర్లను చూసే అవకాశం ఉంటుంది.


వర్షం పడితే ఆటకు ఆటంకం

వర్షం ఆటకు అడ్డంకిగా మారితే, లీగ్ దశలో రిజర్వ్ డే ఉండదు. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గరిష్టంగా ఒక గంట వరకూ పొడిగించవచ్చు. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గ‌డిచిపోయే సరికి ఆట మొదలవకపోతే, ఓవర్లను తగ్గించడం ప్రారంభమవుతుంది. అత్యల్పంగా కనీసం ఐదు ఓవర్ల గేమ్ జరుగుతుందనుకుంటే, దానికి కటాఫ్ సమయం రాత్రి 11:44గా నిర్ణయించారు. ఇక జట్ల పరంగా చూస్తే, ఐదుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆటతీరు నిరాశపరిచింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం సెమీస్ ఆటపై ఫోకస్ చేసింది. ఇప్పటివరకు ఏడు విజయాలతో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ రద్దైతే మాత్రం పరిస్థితి దారుణంగా తయారవుతుంది.


RCB vs CSK అంచనా ప్లేయింగ్ 11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఫిల్ సాల్ట్/జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజిల్‌వుడ్, సుయాష్ శర్మ, సుయాష్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్- షేక్ రషీద్, ఆయుష్ మేట్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), మాథేష్ పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్


ఇవి కూడా చదవండి:

RCB vs CSK: నేడు ఆర్బీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..


Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్


Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Business News and Latest Telugu News

Updated Date - May 03 , 2025 | 11:00 AM