Share News

Rashid Khan: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:51 PM

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ ఇన్‌స్టా వేదికగా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.

Rashid Khan: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్
Rashid Khan

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట్ రషీద్ ఖాన్(Rashid Khan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే దీనికి కారణం. రషీద్ ఖాన్ ఇటీవల నెదర్లాండ్స్‌లో ‘ఖాన్ చారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఆ కార్యక్రమంలో ఆ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో రషీద్ ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చాడు.


ఆమె నా భార్య..

‘ఆగస్టు 2, 2025.. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. నేను రెండో పెళ్లి చేసుకున్నా. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆమె నా జీవిత భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను చారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లా. ఇంత చిన్న విషయంపై రకరకాల ఊహాగానాలు రావడం దురదృష్టకరం. ఆమె నా భార్య. ఇందులో దాచడానికి ఏమీ లేదు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రషీద్ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నాడు.


2024 అక్టోబర్‌లో సంప్రదాయం ప్రకారం రషీద్ మొదటి వివాహం జరిగింది. రషీద్ వివాహ వేడకకు అఫ్గాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకముందే వారిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ

సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 03:54 PM