Shai Hope Record: సచిన్, కోహ్లీలకు దక్కని రికార్డును సాధించిన విండీస్ ప్లేయర్
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:25 PM
ప్రపంచ దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లిలకు కూడా దక్కని ఓ రికార్డు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సాధించాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడంతో ఓ చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను(New Zealand vs West Indies 2nd ODI) కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో విండీస్ కోల్పోయింది. నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో విండీస్ ఓడింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్( Shai Hope century) వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. అయితే హోప్ సెంచరీ వృథా అయింది. కివీస్(New Zealand ) మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్(New Zealand ) బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ను 34 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 34 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. షాయ్ హోప్ 109 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో అతడి తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. మిగిలిన వాళ్లు ఆశించిన మేర రాణించలేదు. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్(Tom Latham) (39*), మిచెల్ సాంట్నర్ (34*) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో కివీస్ మరో 3 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఇక నామమాత్రపు చివరి వన్డే హోమిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది.
హోప్ అరుదైన రికార్డు:
ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన షాయ్ హోప్ అనే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ వంటి స్టార్ ప్లేయర్లు సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ పై తన తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు. అలానే వెస్టిండీస్ ఆల్ టైమ్ వన్డే సెంచరీల జాబితాలో బ్రియాన్ లారా(Brian Lara 19 centuries)తో సమానంగా 19 సెంచరీలతో రెండవ స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ 25 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఆడే 12 దేశాలపై, అన్ని ఫార్మాట్లను కలుపుకుని సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా షాయ్ హోప్ చరిత్ర సృష్టించాడు.
అప్పట్లో టెస్ట్ హోదా కలిగిన 10 దేశాలపై సెంచరీ చేసిన మొదటి వ్యక్తి భారత మాజీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత 2017లో ఆఫ్గానిస్థాన్, ఐర్లాండ్ టెస్ట్ హోదాను పొందాయి. దీంతో టెస్టు హోదా కలిగిన దేశాల సంఖ్య 12కు చేరింది. సచిన్ టెండూల్కర్ కూడా రిటైర్ అయ్యే వరకు టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 9 జట్ల మాత్రమేపై సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ పై చేసిన సెంచరీతో హోప్ 6,000 వన్డే పరుగుల మార్కును కూడా దాటాడు. ఈ మార్కును చేరుకున్న ఏడవ వెస్టిండీస్( West Indies cricket) ఆటగాడిగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లి దక్కని చోటు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి