Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:18 PM
ఇండియన్ ప్రీమియర్ 2026 మినీ వేలానికి ముంబై ఇండియన్స్ తమ మార్క్ చూపిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముంబై జట్టు తాజాగా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) మినీ వేలం త్వరలో జరగనుంది. అయితే దీనికంటే ముందు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తన మార్క్ చూపిస్తోంది. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్(LSG) నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రెస్‌కు ముంబై ఇండియన్స్(Mumbai Indians) ట్రేడ్ చేసుకుంది. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) నుంచి వెస్టిండీస్ ఫినిషర్ షెర్ఫేన్ రూథర్ ఫర్డ్‌ను ముంబై జట్టు ట్రేడ్ రూపంలో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కాగా ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో రూథర్ ఫర్డ్( Sherfane Rutherford)ను రూ. 2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ విండీస్ ఆటగాడు ఇప్పుడు అదే ధర ట్యాగ్‌తో ముంబైకి మారాడు. ఐపీఎల్-2025లో రూథర్ ఫర్డ్ అద్భుతమైన ప్రదర్శన్ చేశాడు. అయిన్పటికీ గుజరాత్ యాజమాన్యం అతడిని ట్రేడ్ చేయడం ఐపీఎల్ అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ముంబై జట్టుకు నమన్ ధీర్ వంటి సూపర్ ఫినిషర్ ఉన్నాడు. తాజాగా జట్టులోకి వస్తున్న రూథర్‌ఫర్డ్‌ను ఏ స్థానంలో ఆడిస్తారనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. అయితే అతడిని మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించుకోవాలని ముంబై(Mumbai Indians) యోచిస్తుందని సమాచారం.
27 ఏళ్ల షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్( Sherfane Rutherford) వెస్టిండీస్ తరపున ఇప్పటివరకు 44 టీ20లు ఆడాడు. టీ20లలో ఆండ్రీ రస్సెల్‌తో కలిసి ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(139) నెలకొల్పిన రికార్డును అతడి పేరిట ఉంది. ఇక 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలిసారి ఐపీఎల్ లోకి రూథర్ ఫర్డ్ అడుగు పెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) లో ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో ముంబైకు కూడా అతడు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత తిరిగి అదే జట్టు తరఫున ఆడనున్నాడు. ఈసారి ఎలా చెలరేగుతాడనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Surya Kumar Skips Ranji Trophy: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి