Mohammed Siraj: సిరాజ్‌కు క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:43 PM
గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాల జాప్యంపై భారత్ క్రికెటర్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ సంస్థ గురువారం వివరణ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) బుధవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం చాలాసేపు ఆలస్యం కావడం, ఆ సంస్థ నుండి సమాచారం పూర్తిగా లేకపోవడంపై విమర్శలు గుప్పించాడు. గువహటి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సిరాజ్.. విమాన సర్వీస్ విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయారంటూ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఎయిర్ ఇండియా( Air India flight) సంస్థ స్పందించింది.
గువాహటి-హైదరాబాద్ ఫ్లైట్ IX 2884ను అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది. ‘అనివార్య కారణాల వల్ల విమానాన్ని రద్దు చేసినందుకు చింతిస్తున్నాం. ఇబ్బంది కలిగినందుకు క్షమించండి. మా సిబ్బంది ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. బుధవారం ప్రయాణికులు ఎదుర్కొన్న పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. మీ సహనం, మీ ఓపికకు ధన్యవాదాలు. పరిస్థితి చక్కబడేంత వరకు మా సిబ్బంది మీకు కావాల్సిన సాయం చేస్తుంది’ అని ఎయిర్ ఇండియా ‘ఎక్స్’లో సిరాజ్ పోస్ట్‌కు సమాధానం ఇచ్చింది.
విమానం ఆలస్యం కావడంపై మహ్మద్ సిరాజ్(Siraj slams Air India) తన ‘ఎక్స్’ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం IX 2884 7.25కు టేకాఫ్ కావాల్సి ఉందని, కానీ ఆలస్యానికి గల కారణమేంటో సమాచారం లేదన్నారు. పదే పదే విచారణలు చేసినప్పటికీ, ఈ ఆలస్యంకు ఎయిర్‌లైన్ ఎటువంటి వివరణ ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. విమానం నాలుగు గంటలు ఆలస్యమైందని, ఇంకా అప్‌డేట్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది వరస్ట్ ఎయిర్ లైన్ ఎక్స్‌పీరియన్స్, ఈ విమానంలో ప్రయాణించమని నేను ఎవరికీ సూచించనని సిరాజ్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
Smriti unfollowed Palas: ఇన్‌స్టాలో పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి! నిజం ఏంటంటే..
ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా