Telangana High Court: గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:19 PM
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 27: గ్రూప్ - 2 2019 ర్యాకంర్లకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. గ్రూప్ 2 ర్యాంకర్లకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ పిటిషనర్లు ఇటీవల డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మెరిట్ లిస్ట్ చెల్లదు అంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను ఆరు వారాలకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కాగా.. గ్రూప్-2 పరీక్షల ఫలితాలను 2019 అక్టోబర్ 24న టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే ఈ ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు సింగిల్ బెంచ్‌కు వెళ్లారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. అప్పటి సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని.. తరువాతనే అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని.. ఎనిమిది వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టీజీపీఎస్సీని సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీనిపై పలువురు పిటిషనర్లు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా... సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ ర్యాంకర్లకు డివిజన్ బెంచ్ ఊరటనిచ్చింది.
ఇవి కూడా చదవండి...
రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్
రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్.. రేపు విచారణకు ఛాన్స్
Read Latest Telangana News And Telugu News