IND vs Pak: పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్‌పై మార్కెట్ అంచనా ఇదే..
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:34 PM
Champions Trophy: పాకిస్తాన్‌ను 320 లోపు కట్టడిచేస్తే భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉంటాయనే కొందరు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ చూసుకుంటే 320 పరుగుల వరకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం మొదటి పవర్ ప్లే పూర్తికాగా పది ఓవర్లకు పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి.... పరుగులు చేసింది. తొమ్మిదవ ఓవర్ వేసిన హర్థిక్ పాండ్యా 8.2 ఓవర్ల వద్ద పాకిస్తాన్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌ను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. 8 ఓవర్ల వరకు వికెట్ పడకపోవడంతో భారత్ అభిమానులు ఒకింత నిరాశ చెందారు. 9వ ఓవర్ వేసిన హర్థిక్ వికెట్ తీయడంతో పాకిస్తాన్ అభిమానులు నిరాశ చెందగా.. భారత్ అభిమానులు మాత్రం పండగ చేసుకున్నారు. పదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీసుకోవడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. ఓపెన్లరు ఇద్దరూ ఫస్ట్ పవర్ ప్లేలో పెవిలియన్ చేరారు. పది ఓవర్ల తర్వాత రిజ్వాన్, షకీల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
స్కోర్ అంచనా ఇదే..
పది ఓవర్ల మొదటి పవర్ ప్లే ముగిసిన తర్వాత పాకిస్తాన్ స్కోర్‌పై మార్కెట్ అంచనా చూసుకుంటే ఇదే విధంగా బ్యాటింగ్ కొనసాగితే 50 ఓవర్లకు 260 పరుగులుల చేసే అవకాశం ఉంది. త్వరగా వికెట్లు కోల్పోతే మాత్రం 220 లోపు పాకిస్తాన్ ఆలౌట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ 30 ఓవర్ల వరకు వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్, షకీల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే మాత్రం 300 వరకు స్కోర్ వెళ్లే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ స్కోర్ 300 దాటడం అంత సులభంగా కనిపించడంలేదు. గత కొన్ని మ్యాచ్‌లలో పాకిస్తాన్ బ్యాటింగ్ శైలి చూస్తే ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ హిట్టింగ్ చేయడం కష్టంగా మారింది. దీంతో భారత్ బౌలర్లపై హిట్టింగ్ కష్టమని చెప్పుకోవాలి. 30 ఓవర్ల వరకు భాగస్వామ్యం నెలకొల్పినా హిట్టింగ్ చేస్తేనే పాకిస్తాన్ 300 స్కోర్ చేరుకునే ఛాన్స్ ఉంది.
320 వరకు ఓకే..
పాకిస్తాన్‌ను 320 లోపు కట్టడిచేస్తే భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉంటాయనే కొందరు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ చూసుకుంటే 320 పరుగుల వరకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చంటున్నారు. పాకిస్తాన్ ఎంత స్కోర్ చేస్తుంది. ఏ ఓవర్‌లో ఎంత స్కోర్ అనేది ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్‌లో తెలుసుకోండి. నేరుగా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.