Manu Bhaker: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం
ABN , Publish Date - Jan 19 , 2025 | 02:00 PM
Manu Bhaker: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఖేల్‌రత్న అవార్డు గ్రహీత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను ఆమె కోల్పోయింది.

డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఖేల్‌రత్న అవార్డు గ్రహీత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను ఆమె కోల్పోయింది. రోడ్డు ప్రమాదంలో భాకర్ అమ్మమ్మ, మేనమామ చనిపోయారు. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు దగ్గర్లో వాళ్లు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. ఆ స్కూటీని ఓ కారు ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఈ యాక్సిడెంట్‌లో భాకర్ అమ్మమ్మ, మేనమామ అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ వార్త తెలిసిన క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో భాకర్‌కు మనోధైర్యం చేకూరాలని అంటున్నారు. ఈ కష్టకాలం నుంచి ఆమె త్వరలోనే బయటపడాలని కోరుకుంటున్నారు.
సంబురాలు ముగిసేలోపే..
మన దేశంలో క్రీడల్లో అత్యున్నత అవార్డుగా భావించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ఇటీవలే గెలుచుకుంది మను భాకర్. ఈ అవార్డును అందుకున్న సంతోషంలో ఉన్న సమయంలోనే అమ్మమ్మ, మేనమామను యాక్సిడెంట్‌లో కోల్పోవడం ఎంతో బాధాకరమనే చెప్పాలి. ఈ బాధ నుంచి కోలుకొని భాకర్ తిరిగి పిస్తోల్ పట్టుకొని షూటింగ్‌కు సై అనేందుకు చాలా టైమ్ పట్టేలా ఉంది. ఏదేమైనా, గతేడాది ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టడం, ఈ ఏడాది ఆరంభంలోనే ఖేల్‌రత్న పురస్కారాన్ని అందుకోవడంతో మురిసిపోయిన భాకర్‌కు ఇది కష్టకాలమనే చెప్పాలి. దీని నుంచి బయటపడి ఆమె ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.
ఇదీ చదవండి:
ఎడ్డం అంటే తెడ్డం.. రోహిత్-గంభీర్ కొట్లాట..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి