Kane Williamson retirement: అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:46 AM
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌నకు కొన్ని నెలల ముందు కేన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌నకు కొన్ని నెలల ముందు కేన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా 93 టీ20లు ఆడిన కేన్ 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 95. కేన్ విలియమ్సన్ 2011లో జింబాబ్వేపై టీ20ల్లోకి అరంగేట్రం చేయగా.. చివరి మ్యాచ్‌ను 2024లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. 75 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇదే సరైన సమయం..
తన రిటైర్‌మెంట్(Williamson T20I retirement)పై కేన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘నా అంతర్జాతీయ టీ20 కెరీర్ పట్ల సంతృప్తిగా ఉన్నా. నన్ను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఇప్పుడు రిటైర్‌మెంట్ ఇస్తే.. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు కూర్పుపై సెలెక్టర్లకు ఓ స్పష్టత ఏర్పడుతుంది. ఈ నిర్ణయం వల్ల యువ క్రికెటర్లకు అవకాశం అభిస్తుంది. టీ20ల్లో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారిని ప్రపంచ కప్‌కు సిద్ధం చేయడానికి ఇది సరైన సమయం’ అని కేన్ విలియమ్సన్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి
ఆసుపత్రి నుంచి శ్రేయాస్ డిశ్చార్జ్
రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి