Jemimah Rodrigues: టీమిండియాలో 12th ప్లేయర్.. ఎవరో తెలుసా!
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:13 PM
జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అందరికి పరిచయం చేసింది..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్(ODI Women WC 2025)లో టీమిండియా(Team India) ఆఖరి లీగ్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నప్పటికీ.. బంగ్లాదేశ్‌తో పోరును సన్నాహకంగా వాడుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి(Guest) మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) అందరికి పరిచయం చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దానికి ‘మీట్ జేడ్, టీమిండియాలో 12th పర్సన్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే..
ఆ అతిథి జెమీమా రోడ్రిగ్స్ పెంపుడు కుక్కపిల్ల. ‘మా ట్రైనింగ్ సెషన్‌లో స్పెషల్ మెంబర్. 12వ ఆటగాడు. కమాన్ జేడ్. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దీనిని మా నాన్న నా 23వ పుట్టిన రోజు సందర్భంగా నాకు బహుమతిగా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జేడ్‌ను ఇష్టపడతారు. దీని పేరు కూడా జే మీద రావాలని జేడ్ అని పెట్టా. చూడండి అది ఎలా బంతిని తీసుకొచ్చిదో. చాలా చక్కగా అందరితో కలిసిపోతుంది. నేనంటే చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే మా ఇద్దరి ఎనర్జీ లెవల్స్ ఒకటే. అది పరుగెడుతుంటే మా అమ్మ కూడా స్మాల్ జెమీ అంటూ ఆటపట్టిస్తుంది. ఇది రాకముందు మా కుటుంబంలో నేనంటే ఎక్కువ ప్రేమ చూపించేవారు. కానీ, జేడ్ వచ్చాక్ అంతా మారిపోయింది’ అని జెమీమా సరదాగా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ
పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్