Share News

Anil Kumble On England: ఒక్క ఓవర్‌కే భయపడతారా? ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన కుంబ్లే!

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:59 PM

టీమిండియాపై విమర్శలకు దిగుతున్న ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేశాడు అనిల్ కుంబ్లే. ఒక్క ఓవర్‌కే ఇంతగా భయపడతారా అంటూ ప్రత్యర్థిని నోరెత్తకుండా చేశాడు భారత జట్టు మాజీ కోచ్.

Anil Kumble On England: ఒక్క ఓవర్‌కే భయపడతారా? ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన కుంబ్లే!
Anil Kumble

లార్డ్స్ టెస్ట్ మూడో రోజు జరిగిన ఓ ఘటన సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆట ముగిసేందుకు కొన్ని క్షణాలే ఉండటంతో వికెట్ కోల్పోవద్దని ఇంగ్లండ్.. బ్రేక్ త్రూ కావాలని భారత్ పట్టుదలతో కనిపించాయి. ఈ తరుణంలో ఆతిథ్య జట్టు ఓపెనర్ జాక్ క్రాలే గాయం సాకు చూపి గేమ్‌ను కొంతసేపు ఆపాడు. ఫిజియోను పిలిపించి తూతూ మంత్రంగా ట్రీట్‌మెంట్ చేయించాడు. అతడి నాటకంతో గిల్ సేనకు చిర్రెత్తుకొచ్చింది. ఆడటం చేతగానప్పుడు ఈ నాటకాలు ఎందుకు అంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా ఇతర భారత ఆటగాళ్లు క్రాలే-డకెట్‌పై సీరియస్ అయ్యారు. అయితే గిల్ దూకుడును ఇంగ్లీష్ మీడియా, ఆ దేశ సీనియర్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ అంశంపై భారత మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..


వికెట్ పడినా నిరాశే..

ఒక్క ఓవర్‌కే భయపడతారా అంటూ ఇంగ్లండ్‌పై గాలి తీసేశాడు కుంబ్లే. వాళ్లు ఆడకుండా తప్పించుకుందామని చూశారని చెప్పాడు. ‘ఐదు టెస్టుల సిరీస్ సగం ముగిసింది. ఇరు జట్లు కూడా చెరో విజయం సాధించాయి. మూడో టెస్ట్‌లో రెండు టీమ్స్ ఇప్పుడు సమాన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ ఒక్క ఓవర్ కూడా ఆడొద్దని అనుకుంది. భారత బ్యాటింగ్ టైమ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఆఖరి వికెట్ పడినప్పుడు వాళ్లు నిరుత్సాహంగా కనిపించారు. చివర్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడ్డారు’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.


కోహ్లీలా గిల్..

ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడనందున వాళ్లతో భారత క్రికెటర్లకు పెద్దగా స్నేహ సంబంధాలు లేవని.. అందుకే ఈ ఘటన జరిగిందని లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇరు జట్ల వ్యూహాలు వేర్వేరుగా ఉండటం కూడా మరో కారణమన్నాడు. గిల్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ అన్నాడు. వేళ్లు చూపిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగడం సరికాదన్నాడు. గత కెప్టెన్ విరాట్ కోహ్లీని గిల్ గుర్తుచేశాడని.. ఇది మంచి సంకేతం కాదన్నాడు సౌథీ.


ఇవీ చదవండి:

మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్!

రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

కోహ్లీ-గిల్ సేమ్ టు సేమ్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:11 PM