Suryakumar Yadav: సిరీస్ గెలుపు క్రెడిట్ వారిదే: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:17 AM
టీ20 సిరీస్ గెలవడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్నామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడటం మెగా టోర్నీకి గొప్ప సన్నాహకంగా మారుతుందని సూర్య అన్నాడు.
భారత్ జట్టు ఆస్ట్రేలియాపై వారి గడ్డపైనే ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ ను కోల్పోయిన బాధ నుంచి తేరుకున్న భారత్.. టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో 2-1 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అభిషేక్ శర్మ( Abhishek Sharma) నిలిచాడు. ఇక టీ20 సిరీస్ గెలవడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav) స్పందించాడు. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్నామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడటం మెగా టోర్నీకి గొప్ప సన్నాహకంగా మారుతుందని సూర్య అన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
టీ20 సిరీస్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..' మా ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది. కాన్‌బెర్రాలో జరిగిన తొలి మ్యాచ్ కూడా పూర్తవ్వాలని కోరుకున్నాం. కానీ వర్షం మన నియంత్రణలో లేని విషయం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లంతా సహకరించిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా 0-1తో వెనుకంజలో నిలిచిన స్థితి నుంచి మేం పుంజుకున్న విధానం అద్బుతం. ఈ గెలుపు క్రెడిట్ మా ప్లేయర్లదే. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లది చాలా డేంజర్ కాంబినేషన్. అలానే అక్షర్(Akshar Patel), వరుణ్ కూడా తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్(Washington Sundar) కూడా అద్భుతంగా రాణించాడు.
జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నందున తుది జట్టు ఎంపిక హెడెక్ గా మారింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా(South Africa), కివీస్(New zeland) వంటి మూడు బలమైన జట్లతో ఆడటం.. టీ20 ప్రపంచకప్ టోర్నీకి గొప్ప సన్నాహకంగా ఉంటుంది. కానీ ఈ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా రెండు ముఖ్యమైన సిరీస్‌లు ఆడాలి. ఇంకా చాలా విషయాలను చూడాల్సి ఉంది. ప్రపంచకప్ మరింత రసవత్తరంగా ఉంటుందని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
Richa Ghosh: వన్డే ప్రపంచ కప్ విజేతకు డీఎస్పీ పదవి
లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..