Share News

Sunil Gavaskar: ఆ దోషికి కఠిన శిక్ష పడాల్సిందే: గావస్కర్

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:04 PM

అతిథి దేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన గురించి విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది. ఇది అత్యంత దారుణమైన ఘటన. దేశంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దోషికి కఠిన శిక్ష పడాల్సిందే.. అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

Sunil Gavaskar: ఆ దోషికి కఠిన శిక్ష పడాల్సిందే: గావస్కర్

వన్డే ప్రపంచ కప్ ఆడటానికి భారత్‌కి వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి వేధించిన విషయం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇండౌర్‌‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ కోసం వచ్చిన క్రికెటర్లు తాము బస చేసిన హోటల్ నుంచి కాఫీ షాపు కోసం బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి బైక్‌పై వెంబడించి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడు అకీల్ ఖాన్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.


ఈ విషయంపై బీసీసీఐ (BCCI) కూడా స్పందించింది. మహిళా క్రికెటర్ల భద్రతపై స్పష్టతనిచ్చింది. కాగా తాజాగా ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. అతిథి దేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం అని చెప్పొచ్చు. అయితే ఈ ఘటన గురించి విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది. ఇది అత్యంత దారుణమైన ఘటన. దేశంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దోషికి కఠిన శిక్ష పడాల్సిందే. అలా చేస్తేనే సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నా’ అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.


ఆసీస్‌తోనే టీమిండియా సెమీస్ పోరు..

టీమిండియా(Team India) ఇవాళ (ఆదివారం) ఆఖరి లీగ్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న భారత్‌కు అక్కడ కఠిన ప్రత్యర్థే ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా ఆసీస్‌తోనే హర్మన్‌ సేన తలపడనుంది. లీగ్ స్టేజ్‌లో ఇప్పటికే ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే 2017 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించిన భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే న్యూజిలాండ్‌పై అద్భుత సెంచరీలు సాధించిన సూపర్ ఓపెనర్ జోడి స్మృతి మంధాన, ప్రతీకా రావల్ మరోసారి రాణిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.


ఇవి కూడా చదవండి..

ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ

పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 12:04 PM