IND VS AUS T20: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:37 PM
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా(India vs Australia Brisbane) మధ్య 5వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(Abhishek Sharma), శుభ్ మన్ గిల్ అదరగొడుతున్నారు. భారీ స్కోర్ చేయడమే తమ టార్గెట్ అన్నట్లుగా ఈ ఇద్దరూ ప్లేయర్లు ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆగింది. ఆట నిలిచే సమయానికి 4.5 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 23, గిల్ 29 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారత్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరపున సత్తా చాటి.. గతేడాది భారత జట్టులోకి అడుగుపెట్టాడు. టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ (IND vs AUS)లో ఉన్న అభిషేక్ శర్మ.. అక్కడ సత్తా చాటుతున్నాడు. ఐదు టీ20 మ్యాచుల్లో భాగంగా ఆసీస్‌తో ఆడిన నాలుగు టీ20లలో వరుసగా.. 19, 68, 25, 28 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ(Abhishek Sharma).. 521 బంతుల్లో 989 పరుగులు సాధించాడు. ఇక ఈ టీ20లో అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో 11 పరుగులు చేయడంతో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా శర్మ నిలిచాడు. 528 బంతుల్లోనే అభిషేక్ శర్మ 1000 పరుగుల మార్క్ ను అందుకున్నాడు.
సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav) 573 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ మాక్స్ వెల్ 603 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా బ్రిస్బేన్(India vs Australia Brisbane)లో ఆఖరిదైన ఐదో టీ20లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ శర్మకు లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్‌ను మాక్స్‌వెల్ జారవిడిచాడు. అదే విధంగా..13 పరుగుల వద్ద బెన్ డ్వార్షుయిస్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్‌కు మరో లైఫ్ వచ్చింది.
T20లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు:
అభిషేక్ శర్మ(528 బంతులు)
సూర్యకుమార్ యాదవ్(573 బంతులు)
గ్లెన్ మాక్స్‌వెల్ (603 బంతులు, ఆస్ట్రేలియా)
ఫిన్ అలెన్ (611 బంతులు, న్యూజిలాండ్)
టిమ్ డేవిడ్ (614 బంతులు, ఆస్ట్రేలియా)
రమేష్ సతీశన్ (629 బంతులు, రొమేనియా)
కాలిన్ మున్రో (635 బంతులు, న్యూజిలాండ్)
ఎవిన్ లూయిస్ (640 బంతులు, వెస్టిండీస్)
ఇవి కూడా చదవండి
India vs Australia 5th T20: అందుకే తిలక్‌ను పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి