YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:28 PM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు పోలీసులపై పులివెందుల పోలీసులు కేసు..
కడప, నవంబర్ 08: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు పోలీసులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.
వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు పోలీస్ అధికారులు కారకులు. అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్‌లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.
Also Read:
PM Modi: మీ పిల్లలు డాక్టర్లు కావాలా.. దోపిడీదారులు కావాలా
Congress vs BJP: నా ఆట చూపిస్తా... బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్