ICC New Rule: బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై అలాంటి షాట్లు ఆడలేరు!
ABN , Publish Date - Oct 18 , 2025 | 07:31 PM
సాధారణంగా క్రికెట్ ఆటలో బ్యాటర్లు తరచుగా బౌలర్లను అయోమయానికి గురిచేయడానికి, ఫీల్డింగ్ సెటప్‌ను దెబ్బతీయడానికి వింత వింత షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా, కొందరు బ్యాటర్లు స్టంప్‌ల వెనుకకు, మరికొందరు పిచ్‌పై నుంచి పూర్తిగా పక్కకు జరిగి షాట్లు ఆడటం చేస్తుంటారు.
ప్రతి ఆటలో నియమ నిబంధనలు ఉంటాయి. అలానే క్రికెట్ లోని అనేక రూల్స్ ఉంటాయి. అయితే ఈ నిబంధనల్లో తరచూ చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. ఇలా మార్పులు చేసి తీసుకొచ్చే కొత్త రూల్స్ ఒక్కొక్కసారి బౌలర్ కు, మరో సందర్భంలో బ్యాటర్ కు అనుకూలంగా ఉంటాయి. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూల్స్ లో ఓ కీలక మార్పు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాజీ ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ నియమం బౌలర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని సమాచారం.
సాధారణంగా క్రికెట్ లో బ్యాటర్లు(Batters) తరచుగా బౌలర్లను అయోమయానికి గురిచేయడానికి, ఫీల్డింగ్ సెటప్‌ను దెబ్బతీయడానికి వింత వింత షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా, కొందరు బ్యాటర్లు స్టంప్‌ల వెనుకకు, మరికొందరు పిచ్‌పై నుంచి పూర్తిగా పక్కకు జరిగి షాట్లు ఆడటం చేస్తుంటారు. అయితే, ఈ విధమైన ఆటను నియంత్రించడానికి, బౌలర్‌కు ప్రయోజనం చేకూరేందుకు ఐసీసీ కొత్త నియమం(ICC new rules 2025) తీసుకొచ్చింది.
కొత్త నిబంధన ఇదే:
బంతిని ఎదుర్కొనే సమయంలో బ్యాటర్ బ్యాట్, అతడి శరీరంలో ఏ ఒక్క భాగం కూడా పిచ్ (Pitch) లోపల లేకపోతే, ఆ బంతిని ‘డెడ్ బాల్’ (Dead Ball)గా ప్రకటిస్తారు. ఇది MCC (మేరీలెబోన్ క్రికెట్ క్లబ్) అప్‌డేట్ చేసిన 2017 కోడ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ క్రికెట్ ఆధారంగా రూపొందించారు. అలానే బ్యాట్స్‌మెన్ పిచ్‌ను విడిచిపెట్టేలా చేసే ఏ బంతి అయినా ‘నో బాల్’(No Ball)గా ప్రకటించబడుతుంది. ఒకవేళ బ్యాటర్ పిచ్ వెలుపల ఉండి షాట్ ఆడి, అది ఫోర్ లేదా సిక్స్ వెళ్లినా, అంపైర్ ‘డెడ్ బాల్’ అని ప్రకటించడం అవి స్కోర్ లో యాడ్ కావు. అలానే ఈ డెలివరీని ఓవర్‌లోని లీగల్ బాల్‌గా పరిగణిస్తారు. తాజాగా నిబంధన ప్రకారం(ICC new rules 2025) బ్యాటర్లు ఇకపై తమ స్థానాన్ని పూర్తిగా మార్చుకుని, పిచ్‌ను వదిలి, విభిన్నమైన షాట్లు ఆడటానికి ప్రయత్నించలేరు.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ