Share News

Swachhandhra Program 2025: నిధుల కొరత వాస్తవమే.. అయినప్పటికీ: మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 18 , 2025 | 02:25 PM

ప్రతి నెల ఒక థీమ్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. కాలుష్య నివారణ , సోలార్, గ్రీన్ ఎనర్జీ, సూర్య ఘర్ వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.

Swachhandhra Program 2025: నిధుల కొరత వాస్తవమే.. అయినప్పటికీ: మంత్రి నారాయణ
Swachhandhra Program 2025

విజయవాడ, అక్టోబర్ 18: నగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనటం జరిగిందని.. ఈ కార్యక్రమాన్ని 2014లో సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. పీఎం మోదీ ఏ నిబంధనలు అయితే పెట్టారో అవే స్వచ్ఛాంధ్రలో ఉన్నాయని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుందని.. ప్రతి నెల ఒక థీమ్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. కాలుష్య నివారణ , సోలార్, గ్రీన్ ఎనర్జీ, సూర్య ఘర్ వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. సూర్య ఘర్‌లో ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఉంటుందని పేర్కొన్నారు.


ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయిలో సబ్సీడీ అందిస్తున్నామని తెలిపారు. డ్రైనేజ్ వాటర్‌ను కాల్వలోకి మళ్ళించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 2014, 2019 లో అనేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామని.. కానీ 2019, 2024 మధ్య స్వచ్ఛాంధ్రను పక్కన పెట్టారని మండిపడ్డారు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి స్వచ్ఛాంధ్రను పట్టాలు ఎక్కించడం జరిగిందన్నారు. మున్సిపలిటీలో లైట్స్, రోడ్డుపై దృష్టిపెట్టామని చెప్పారు. నిధుల కొరత ఉన్న మాట వాస్తవమని.. గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నందున కొంత ఇబ్బంది ఉందన్నారు. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే

ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 02:26 PM