Share News

India vs Sri Lanka: శ్రీలంక చేతిలో భారత్ ఘోర పరాజయం

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:00 PM

టాస్ ఓడిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లాహిరు సమరకూన్(14 బంతుల్లో 52), కెప్టెన్‌ మధుశంక(15 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. అనంతరం 139 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.

India vs Sri Lanka: శ్రీలంక చేతిలో భారత్ ఘోర పరాజయం
Hong Kong Sixes 2025

హాంగ్ కాంగ్ సిక్సెస్(Hong Kong Sixes 2025) టోర్నమెంట్‌లో భారత్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం శ్రీలం‍కతో జరిగిన బౌల్ గ్రూపు మ్యాచ్‌(India vs Sri Lanka)లో 48 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 138 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం 139 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.


టాస్ ఓడిన శ్రీలంక(Sri Lanka cricket) తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లాహిరు సమరకూన్(14 బంతుల్లో 52), కెప్టెన్‌ మధుశంక(15 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. అనంతరం జయ తిలకే 5 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ధనంజయ్ లక్షణ్ 2 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇక భారత్ బౌలర్లలో ప్రతీ ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒకటంటే ఒక వికెట్ ను కూడా భారత బౌలర్లు పడగొట్టలేదు. మొత్తం నిర్ణీత 6 ఓవర్లలో శ్రీలంక వికెట్ కోల్పోకుండా 138 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్‌(Team India defeats) నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.


భారత బ్యాటర్లలో భరత్‌ చిప్లి(13 బంతుల్లో 41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ స్టువర్ట్‌ బిన్నీ(Stuart Binny)(9 బంతుల్లో 25) కాసేపు మెరుపులు మెరిపించాడు. రాబిన్ ఊతప్ప 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలానే అభిమన్యు మిథున్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ టోర్నీలో భారత్ కు ఇది నాలుగో ఓటమి( India fourth loss). అంతేకాక ఈ టోర్నీలో భారత్ కు ఇదే చివరి మ్యాచ్ కావడం గమన్హారం. అంతకుముందు కువైట్‌, యూఏఈ, నేపాల్ వంటి పసికూనల చేతిలో మెన్ ఇన్ బ్లూ పరాజయం పాలైంది. దినేష్ కార్తీక్, రాబిన్ ఊతప్ప, బిన్నీ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికి కూడా టీమిండియా క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది.


ఇవి కూడా చదవండి:

ఆ ఐదుగురు ఔట్!

ధోనీ రికార్డు సమం చేసిన డికాక్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 01:09 PM