Share News

The world's largest spider's nest: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును కనుగొన్న పరిశోధకులు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:52 AM

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో పరిశోధకులు దీనిని కనుగొన్నారు. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గూడు వ్యాపించి ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాదాపు 1,11,000 సాలీళ్లు కలిసి ఈ ఉమ్మడి గూడును నిర్మించినట్లు తెలిపింది.

The world's largest spider's nest: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును కనుగొన్న పరిశోధకులు
The worlds largest spiders nest

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో పరిశోధకులు కనుగొన్నారు. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గూడు వ్యాపించి ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాదాపు 1,11,000 సాలీళ్లు కలిసి ఈ ఉమ్మడి గూడును నిర్మించినట్లు వెల్లడించింది. రెండు జాతులకు చెందిన సాలీళ్లు ఈ పెద్ద గూడును ఏర్పాటు చేశాయని.. ఇంత పెద్ద స్థాయిలో ఒకేచోట గూడు కట్టడం అరుదైన దృశ్యమని పరిశోధకులు భావిస్తున్నారు. సూర్యరశ్మిలేని అధికస్థాయి విషపూరిత హైడ్రోజన్‌ సల్ఫర్‌ వాయువు ఉన్న గుహలో ఈ సాలెపురుగులు ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. సల్ఫర్‌ గుహ ఎంట్రెన్స్‌లో కటిక చీకటిలో ఈ భారీ సాలీడు గూడు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


ఇంత పెద్దదైన గూడులో ఆధిపత్య సాలీడు జాతులు కలిసి జీవించడమనేది అత్యంత విచిత్రమని, ఇదొక ప్రత్యేకమైన కేసుగా పేర్కొన్నారు. ఇక గుహలోపలి వరకు ఉన్న గూడులోని సాలీడు పురుగులు.. చిన్న మిడ్జ్‌లను తింటాయని పరిశోధకులు గుర్తించారు. సల్ఫర్ తినే సూక్ష్మజీవులను ఈ మిడ్జ్‌లు ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు. గుహ బయట వైపున గల గూడులోని సాలీడు పురుగులు వీటికి అత్యంత భిన్నంగా ఉన్నాయన్నారు. జన్యుపరంగా కూడా ఇవి చాలా వ్యత్యాసంగా ఉన్నాయని పేర్కొన్నారు. గుహలోపల ఉండే మురికికి అనుగుణంగా అక్కడ ఉండే సాలీడులు జీవిస్తున్నట్లు తెలిపారు.


ఈ గూడుని రెండు వేర్వేరు జాతులకు చెందిన సాలీళ్లు నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యకాంతి చేరని, అధిక హైడ్రోజన్ సల్ఫర్ వాయువు ఉన్న ఆ గుహలో ఈ భారీ గూడు ఏర్పాటు చేశాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భారీ గూడుపై ప్రధాన రచయిత ఇస్త్వాన్ ఉరాక్ మాట్లాడుతూ.. ‘ప్రకృతిలో ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. ఆ గూడు చూసినప్పుడు మాలో కలిగిన భావాలను మేం వర్ణించలేము. అవి ఆశ్చర్యం, గౌరవం, కృతజ్ఞతల మేళవింపు’ అని అన్నారు. కాగా, ఈ భారీ సాలీడు గూడుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

అమ్మమ్మతో నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..

పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం

Updated Date - Nov 09 , 2025 | 01:40 PM