Harmanpreet Kaur: విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం: హర్మన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:59 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ పోరుకు టీమిండియా సన్నద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానుల ఆశలను పెంచేలా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women’s World Cup 2025) ఫైనల్ పోరుకు టీమిండియా సన్నద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్-సౌతాఫ్రికా(India vs South Africa final) తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానుల ఆశలను పెంచేలా ఉన్నాయి.
ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్(Harmanpreet Kaur) మాట్లాడింది. ‘ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఓటమిని చవిచూస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు. కానీ ఈ సారీ ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరుతాం. గెలుపు అనుభూతిని మాత్రమే పొందాలని అనుకుంటున్నాం. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైంది. మహిళల క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ రోజు కానుంది. దీనికోసం మేం చాలా కష్టపడ్డాం. మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది.
ఇదో గొప్ప అవకాశం..
‘భారత మహిళల జట్టు ఫైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. ఇది మాకు గొప్ప అవకాశం. గత రెండు మ్యాచ్‌ల్లో మేము ఆడిన తీరు చూస్తే దేశమంతా గర్వపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద మ్యాచ్, ఈ అవకాశాన్ని మేము ఆస్వాదించాలని అనుకుంటున్నాము. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడటం కంటే మరొక పెద్ద విషయం లేదు. మేము ఒకరికి ఒకరం అండగా ఉంటూ మ్యాచ్‌ను గెలిపించడానికి ప్రయత్నిస్తాం. ఇది మా జట్టు ఐక్యతను చూపిస్తుంది’ అని హర్మన్‌ప్రీత్ తెలిపింది.
రెండో సెమీస్‌లో ఆసీస్‌పై టీమిండియా 339 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు ఇంగ్లండ్‌ను 125 పరుగుల తేడాతో ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ చేరుకుంది. సొంత గడ్డపై ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణావకాశం భారత జట్టుకు లభించింది. మరి టీమిండియా ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా? చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..