Gautam Gambhir: బీసీసీఐదే తుది నిర్ణయం.. కోచ్ పదవిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:35 PM
టీమిండియా సౌతాఫ్రికాపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్‌నకు గురైంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని వెల్లడించాడు. ఈ పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి టెస్టులో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 30 పరుగుల తేడాతో భారత్ ఓడింది. దీంతో 2-0 తేడాతో సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ అయింది. సఫారీ సేన దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్‌పై భారత్‌లో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కోల్‌కతా టెస్టు తర్వాత నుంచే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంభీర్(Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా తాను పనికి రాడంటూ వస్తున్న విమర్శలపై స్పందించాడు.
‘కోచ్‌గా మీ భవిష్యత్తు ఏంటి’ అని మ్యాచ్ ఓటమి అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు గంభీర్ స్పందించాడు. ‘నా కోచ్ పదవిపై బీసీసీఐదే తుది నిర్ణయం. నేను ఇక్కడ కొనసాగాలా? లేదా? నేను ఈ పదవికి అర్హుడినా? కాదా? వంటి ప్రశ్నలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ దేశమే ప్రధానం.. నేను కాదు. భారత క్రికెట్ ప్రపంచ వేదికలపైనే కాదు స్వదేశంలోనూ గెలవడమే ముఖ్యం. గెలుపు విషయానికే వస్తే.. ఇటీవల ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది. అప్పుడు కూడా నేనే కోచ్‌గా ఉన్నా. టెస్టు క్రికెట్‌లో వైఫల్యం ఆటగాళ్లనో, లేదా ఏ ఒక్కరినో నిందించలేరు. ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే సమష్టి కృషి అవసరం’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర
Basketball Player Death: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం