Share News

Ind Vs SA: అందుకే ఓడిపోయాం: పంత్

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:17 PM

గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.

Ind Vs SA: అందుకే ఓడిపోయాం: పంత్
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై టీమిండియా ఓటమిని చవి చూసింది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోన్న సఫారీ సేన గెలుపు లాంఛనమే అన్నట్లుగా ఆటను కొనసాగించింది. కోల్‌కతాలో తొలి టెస్టు కూడా ప్రొటీస్ జట్టే గెలవడంతో ఈ సిరీస్.. సౌతాఫ్రికా టీమిండియాను క్లీన్ స్వీప్ చేసి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. భారత్.. అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఫలితం.. ఓటమి!


ఈ ఓటమిపై టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) స్పందించాడు. మ్యాచ్ అనంతరం జట్టు ఓటమిపై మాట్లాడాడు. ‘కాస్త నిరాశకు లోనయ్యాం. మేం సమిష్టిగా రాణించలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రిడిట్ ఇవ్వక తప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాలి. సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. మేం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. గెలవాలంటే భాగస్వామ్యాలు నెలకొల్పాలి. అది మాలో లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యం చెల్లించాం’ అని పంత్ వివరించాడు.


కోల్‌కతాలోని తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన భారత్.. గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఫలితం.. 25 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టుల్లో సౌతాఫ్రికా టీమిండియాను వైట్‌వాష్ చేసింది.


ఇవి కూడా చదవండి:

Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర

Basketball Player Death: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం

Updated Date - Nov 26 , 2025 | 02:17 PM